Daily essentials: సామాన్యులకు మరో షాక్.. పెరగనున్న వంట నూనె , సబ్బులు, బిస్కెట్ల ధరలు

సామాన్యుల నడ్డి విరిచేందుకు ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీలు రెడీ అవుతున్నాయి. రోజువారి వినియోగించే నూనెలు, షాంపూలు, సబ్బులు, బిస్కెట్ల వంటి వాటి ధరలు పెంచబోతున్నాయి.

Daily essentials:  సామాన్యులకు మరో షాక్.. పెరగనున్న వంట నూనె , సబ్బులు, బిస్కెట్ల ధరలు
Follow us

|

Updated on: Jan 11, 2021 | 8:49 PM

సామాన్యుల నడ్డి విరిచేందుకు ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీలు రెడీ అవుతున్నాయి. రోజువారి వినియోగించే నూనెలు, షాంపూలు, సబ్బులు, బిస్కెట్ల వంటి వాటి ధరలు పెంచబోతున్నాయి. ముడి పదార్థాల ఖర్చు పెరగడమే ఇందుకు కారణమని సదరు సంస్థలు చెబుతున్నాయి. ఇప్పటికే మారికో లాంటి సంస్థలు తమ ఉత్పత్తుల ధరల పెంపును కన్ఫామ్ చేశాయి. పార్లే, డాబర్‌తో పాటు  పతంజలి వంటి సంస్థలు కూడా ధరల పెంపు దిశగా చర్చలు జరపడం గమనార్హం.  వంట నూనె, కొబ్బరి నూనె, టీ పొడి వంటి ముడి వస్తువుల ధరలు పెరుగుతున్నా కానీ, ఇబ్బందులను భరించామని..ఇక లాభాలపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉన్నందున ధరలు పెంచాబోతున్నట్లు సంస్థలు చెబుతున్నాయి.

‘గత 3-4 నెలల్లో వంట నూనెల ధరలు పెరుగుతున్నాయి. దీంతో మా మార్జిన్‌పై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇదే పెంపు కొనసాగితే ధరలు పెంచక తప్పదని పార్లే ఉత్పత్తుల సీనియర్‌ విభాగ హెడ్‌ మయాంక్‌ షా తెలిపారు. పతంజలి ప్రతినిధి ఎస్‌కే తిజరావాలా, డాబర్‌ ఇండియా సీఎఫ్‌ఓ లలిత్‌మాలిక్‌ కూడా ఇదే రకమైన అభిప్రాయం వ్యక్తం చేశారు.

Also Read:

AP Local Body Polls: స్థానిక ఎన్నికలపై సింగిల్​ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్‌కు అప్పీల్‌ చేసిన ఎస్ఈసీ

AP Local Body Polls: ఏపీ పంచాయితీ ఎన్నికల షెడ్యూల్‌ను సస్పెండ్ చేసిన హైకోర్టు.. ప్రజారోగ్యం దృష్టిలో పెట్టుకున్నట్లు వెల్లడి

Andhra Pradesh Ration: ఏపీలో ఇకపై ఓటీపీ చెబితేనే రేషన్.. ఫిబ్రవరి నుంచి అమల్లోకి కొత్త విధానం..