ఆ రెండు పద్ధతులు పాటిస్తే.. కరోనా పరార్..!

కరోనా వైరస్‌ చైనాతో సహా ప్రపంచ దేశాలను వణికిస్తోంది. రోజురోజుకీ విస్తరిస్తూ విలయతాండవం చేస్తోంది. దీని నివారణకు ఇంతవరకు అధికారికంగా ఔషధం కనిపెట్టలేదు. ఈ వ్యాధి వలన మరణించిన వారి సంఖ్య అధికంగానే ఉన్నప్పటికీ, తగ్గి ఇంటికి క్షేమంగా తిరిగి వెళ్లినవారు కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలో చక్కగా గాలి, వెలుతురు తగిలే ప్రదేశాలలో రోగులను ఉంచటం వలన కరోనా వైరస్‌ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడతాయని నిపుణులు సూచిస్తున్నారు. అంతే కాకుండా… తమ ఏసీలను […]

ఆ రెండు పద్ధతులు పాటిస్తే.. కరోనా పరార్..!
Follow us

| Edited By:

Updated on: Feb 12, 2020 | 2:14 PM

కరోనా వైరస్‌ చైనాతో సహా ప్రపంచ దేశాలను వణికిస్తోంది. రోజురోజుకీ విస్తరిస్తూ విలయతాండవం చేస్తోంది. దీని నివారణకు ఇంతవరకు అధికారికంగా ఔషధం కనిపెట్టలేదు. ఈ వ్యాధి వలన మరణించిన వారి సంఖ్య అధికంగానే ఉన్నప్పటికీ, తగ్గి ఇంటికి క్షేమంగా తిరిగి వెళ్లినవారు కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలో చక్కగా గాలి, వెలుతురు తగిలే ప్రదేశాలలో రోగులను ఉంచటం వలన కరోనా వైరస్‌ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడతాయని నిపుణులు సూచిస్తున్నారు. అంతే కాకుండా… తమ ఏసీలను ఆపేసి ఫ్యాన్లను వాడమంటూ కూడా వారు సలహా ఇస్తున్నారు. చేతులను శుభ్రంగా కడుక్కోవటం, ఫ్యాన్లను వాడి తాజా గాలిలోఉండటం ద్వారా కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టవచ్చని వారు అంటున్నారు.

ఈ వైరస్‌ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ప్రపంచదేశాలన్నీ మరింత అప్రమత్తమయ్యాయి. తమ దేశాల్లో హై అలర్ట్‌ ప్రకటించాయి. కరోనా సూక్ష్మజీవులు పొడిగా, చల్లగా ఉండే వాతావరణంలో అధికంగా వృద్ది చెందుతాయి. వెచ్చని వాతావరణం కలిగిఉన్న సింగపూర్‌లో ఈ వ్యాధి విస్తరణ తక్కువగా ఉంది. కాగా సింగపూర్‌లో ఇప్పటి వరకు కేవలం 45 కేసులు నమోదయ్యాయి. ఈ విషయమై సింగపూర్‌ వైద్య ఆరోగ్య శాఖ ఛీఫ్‌ సైంటిస్ట్‌ ప్రొఫెసర్‌ టాన్‌ ఖోర్‌ ముఖ్య విషయాలను వెల్లడించారు.

ఈ వైరస్‌ వుహాన్‌లోని ఓ సముద్రపు ఆహార ఉత్పత్తుల మార్కెట్‌ లో వ్యాపించినట్లు అధికారులు గుర్తించారు. కరోనా వైరస్‌ నివారణ చర్యలకు నేతృత్వం వహించటానికి సింగపూర్‌ ప్రభుత్వం నియమించిన ఎనిమిది మంది నిపుణుల బృందంలో ఆయన ఒకరు. కరోనా వ్యాధిని నిరోధించటానికి ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెంటిగ్రేడుకు పైన… గాలిలో తేమ శాతం 80 కి పైగా ఉన్న వాతావారణం ఉత్తమం. అంతేకాకుండా బహిరంగ ప్రదేశాల్లో కరోనా వైరస్‌ వ్యాప్తి తక్కువగా ఉంటుందని తెలుస్తోంది.

చైనాలోని వుహాన్‌లో బయటపడిన కరోనా వైరస్ 25 దేశాలకు విస్తరించింది. కరోనా సోకిందని అనుమానం ఉన్నవారు తమ గది తలుపులు, కిటికీలను తెరిచి ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. సూర్యుని నుంచి వచ్చే అల్ట్రా వయొలెట్‌ కిరణాలు కరోనా వైరస్‌ను చంపగలవని మరో శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ వాంగ్‌ లింఫా అభిప్రాయపడుతున్నారు. సూర్యకాంతిలో కొంతసేపు ఉండటం వలన లభించే విటమిన్‌-డి తో రోగనిరోధక వ్యవస్థ కూడా బలోపేతమవుతుందని ఆయన అంటున్నారు.

Latest Articles
ఆ క్రెడిట్ కార్డు యూజర్లకు గుడ్ న్యూస్.. 50 లీటర్ల పెట్రోల్ ఫ్రీ
ఆ క్రెడిట్ కార్డు యూజర్లకు గుడ్ న్యూస్.. 50 లీటర్ల పెట్రోల్ ఫ్రీ
ఈ ఫుడ్స్ పిల్లలకు పెట్టారంటే.. బ్రెయిన్ షార్ప్‌గా పని చేస్తుంది..
ఈ ఫుడ్స్ పిల్లలకు పెట్టారంటే.. బ్రెయిన్ షార్ప్‌గా పని చేస్తుంది..
ఆ పెట్టుబడి పథకంతో అదిరే లాభాలు.. ఎఫ్‌డీ కంటే సూపర్ రిటర్న్స్
ఆ పెట్టుబడి పథకంతో అదిరే లాభాలు.. ఎఫ్‌డీ కంటే సూపర్ రిటర్న్స్
ఎప్పుడూ నిద్ర మత్తుగా ఉంటుందా.? ఈ విటమిన్‌ లోపం ఉన్నట్లే..
ఎప్పుడూ నిద్ర మత్తుగా ఉంటుందా.? ఈ విటమిన్‌ లోపం ఉన్నట్లే..
తారక్ పుట్టిన రోజున అదిరిపోయే అప్డేట్స్.. ఫ్యాన్స్‌కు పూనకాలే
తారక్ పుట్టిన రోజున అదిరిపోయే అప్డేట్స్.. ఫ్యాన్స్‌కు పూనకాలే
మరో సరికొత్త రికార్డులో కింగ్ కోహ్లీ.. తొలి టీమిండియా ప్లేయర్‌గా
మరో సరికొత్త రికార్డులో కింగ్ కోహ్లీ.. తొలి టీమిండియా ప్లేయర్‌గా
తెలంగాణ బీజేపీ ఎన్నికల ప్రచారంలో మలయాళ నటుడు..
తెలంగాణ బీజేపీ ఎన్నికల ప్రచారంలో మలయాళ నటుడు..
బజాజ్ పల్సర్ 125 రిలీజ్ చేశారోచ్చ్… ఆ బైక్‌లకు గట్టి పోటీ
బజాజ్ పల్సర్ 125 రిలీజ్ చేశారోచ్చ్… ఆ బైక్‌లకు గట్టి పోటీ
మైలేజ్ ఆలోచించే కారు కొంటున్నారా..? ఆ కార్లల్లో ప్రధాన తేడాలివే.!
మైలేజ్ ఆలోచించే కారు కొంటున్నారా..? ఆ కార్లల్లో ప్రధాన తేడాలివే.!
పాకిస్థానీయులకు వైద్య సహాయం అందించిన భారత నావీ
పాకిస్థానీయులకు వైద్య సహాయం అందించిన భారత నావీ