Hair Health: స్మార్ట్ ఫోన్ అధికంగా వాడితే పేలు వస్తాయా.. నిపుణుల అధ్యయనంలో ఆసక్తికర విషయాలు

|

Sep 04, 2022 | 10:37 AM

చిన్నా పెద్దా ఆడా మగా అనే సమస్య లేకుండా అందరినీ వేధిస్తున్న సమస్య తలలో పేలు. ముఖ్యంగా స్కూల్స్, కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు ఈ సమస్య అధికంగా ఉంటుంది. బహుశా ఈ సమస్య ఎదుర్కోని వారు ఎవరూ ఉండరేమో...

Hair Health: స్మార్ట్ ఫోన్ అధికంగా వాడితే పేలు వస్తాయా.. నిపుణుల అధ్యయనంలో ఆసక్తికర విషయాలు
Hair Tips
Follow us on

చిన్నా పెద్దా ఆడా మగా అనే సమస్య లేకుండా అందరినీ వేధిస్తున్న సమస్య తలలో పేలు. ముఖ్యంగా స్కూల్స్, కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు ఈ సమస్య అధికంగా ఉంటుంది. బహుశా ఈ సమస్య ఎదుర్కోని వారు ఎవరూ ఉండరేమో. పేలు పడితే తలంతా చికాకు పెడుతుంది. అంతే కాకుండా దురద వస్తుంది. గతంలో అమ్మమ్మ నానమ్మలు పిల్లలను తమ వద్ద కూర్చోబెట్టుకుని తీరిగ్గా పేలు తీసేవారు. కానీ ప్రస్తుతం మారిపోయిన లైఫ్ స్టైల్, బిజీ కారణంగా పేలు తీసేవారు లేకుండా పోయారు. దీంతో రకరకాల ఆయిల్స్ ను వాడేస్తున్నాం. వీటితో కలిగే లాభం కన్నా జరిగే నష్టమే ఎక్కువ. అయితే పేలు ఎలా వస్తాయో.. ఎక్కడి నుంచి వస్తాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా. పేలు గుడ్ల నుంచి వస్తాయి. ఇద్దరు వ్యక్తులు పరస్పరం తాకినప్పుడు పేలు వ్యాప్తి అవుతాయి. ఇవి మనిషి రక్తాన్ని ఆహారంగా తీసుకుని జీవిస్తుంటాయి. పెద్దలతో పోల్చితే పిల్లలకు పేల సమస్య ఎక్కువగా ఉంటుంది. చిన్న పిల్లలను చూడగానే ఎత్తుకోవాలనిపిస్తుంది. వారిని బుజ్జగించాలనిపిస్తుంటుంది. ఇలా చేసిన సమయంలో వారి తలలో ఉండే పేలు మనకు వస్తాయి. అంతే కాకుండా పొడవైన జుట్టు ఉండటం వల్ల కూడా పేలు వ్యాప్తి చెందుతాయని నిపుణులు చెబుతున్నారు.

అయితే.. స్మార్ట్ ఫోన్ ను అధికంగా వినియోగిస్తే పేలు వ్యాప్తి చెందుతాయన్న వాదనపై నిపుణులు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. నిజానికి.. స్మార్ట్‌ఫోన్‌ ద్వారా పేలు వ్యాపించవు. యువతీ యువకులు కలిసి సెల్ఫీలు తీసుకునేటప్పుడు, వీడియోలు, ఫొటోలు కలిసి చూసే సమయంలో వారి తలలు దగ్గర దగ్గరగా ఉంటాయి. అప్పుడు ఒకరి జుట్టు మరికొరి జుట్టుకు తాకుతుంది. దీంతో పేలు సులభంగా వ్యాపిస్తాయి. కొత్త వ్యక్తిని తాకగానే పేలు వెంట్రుకలను పాకుతూ వెళ్లిపోతాయి. వేరే వారి తలపైకి చేరి గుడ్లు పెడతాయి. అలా సంతతిని పెంచుకుంటూ పెను సమస్యగా మారతాయి. పేల సమస్య తీవ్రంగా ఉంటే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం..