ఈఎస్ఐ పరిధిలోని ఉద్యోగులకు గుడ్ న్యూస్

ఈఎస్ఐ పరిధిలోని ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. మెటర్నిటీ ఖర్చులను పెంచాలని నిర్ణయం తీసుకుంది. దీంతో స్కీమ్‌లోకి వచ్చే ఉద్యోగి భార్యలకు...

ఈఎస్ఐ పరిధిలోని ఉద్యోగులకు గుడ్ న్యూస్
Follow us

|

Updated on: Jul 29, 2020 | 7:41 PM

ఈఎస్ఐ పరిధిలోని ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. మెటర్నిటీ ఖర్చులను పెంచాలని నిర్ణయం తీసుకుంది. దీంతో స్కీమ్‌లోకి వచ్చే ఉద్యోగి భార్యలకు ప్రసూతి ఖర్చుల కింద రూ.7,500 అందిచనుంది. ప్రస్తుతం ఈ స్కీంలోనివారికి రూ.5 వేలు ఖర్చుల కోసం ఇస్తున్నారు.

కార్మిక మంత్రిత్వ శాఖ మెటర్నిటీ ఖర్చులను పెంచే నిర్ణయానికి సంబంధించి ఒక గెజిట్‌ను  విడుదల చేసింది. మెటర్నిటీ వ్యయాల పెంపునకు సంబంధించి ప్రజలు తమ అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది.  30 రోజుల్లో గడవులోగా సూచనలు, సలహాలు తెలపాలని కోరింది.

ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) ఈఎస్ఐ స్కీమ్‌ను అందిస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్‌ రూల్స్ 1950లోని రూల్ 56ఏను సవరిస్తోంది. అయితే ఈఎస్ఐ హాస్పిటల్‌లో వైద్యం చేయించుకోని మహిళలకు మాత్రమే ఈ రూ.7,500 అందించనున్నారు.

కాగా రూ.21,000లోపు వేతనం ఉన్న ఉద్యోగులు మాత్రమే ఈఎస్ఐ స్కీమ్‌లోకి వస్తారు. ఇందులో ఉన్నటువంటి ఉద్యోగులకు పలు రకాల ప్రయోజనాలు లభిస్తుంటాయి. ఉద్యోగం పోయినప్పుడు డబ్బులు పొందటం, సహా ఈఎస్ఐ హాస్పిటల్స్‌లో ఉచిత వైద్యం వంటి ప్రయోజనాలు ఉందులో లభిస్తాయి. అలాగే మహిళలకు మెటర్నిటీ ఖర్చులకు కూడా ఈ స్కీమ్‌లో డబ్బులు అందిస్తారు.