11 ఏళ్ల బాలుడి ప్రాణం తీసిన పతంగి.. రోడ్డెక్కిన గ్రామస్తులు.. అసలేం జరిగిందంటే..?

విద్యుత్‌ అధికారులు సకాలంలో స్పందించి వైర్లను సరి చేసి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని గ్రామస్తులు, బాలుడు తల్లిదండ్రులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు.. అధికారుల నిర్లక్ష్యమే పసివాడి ప్రాణం తీసిందంటూ స్థానికులు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు.

Follow us
Diwakar P

| Edited By: Jyothi Gadda

Updated on: Nov 19, 2024 | 1:01 PM

చెట్టుకు వేలాడుతున్న గాలిపటం కోసం వెళ్లిన ఓ బాలుడు విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. ఈ విషాద సంఘటన నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో చోటు చేసుకుంది. కుర్నాపల్లికి చెందిన మతిన్(11) ఆరో తరగతి చదువుతున్నాడు. సోమవారం ఉదయం పతంగి ఎగురవేస్తుండగా అది చెట్టుకు తట్టుకుంది. దానిని తీసేందుకు ఇనుప రాడ్ పట్టుకుని చెట్టెక్కాడు. రాడ్ విద్యుత్ తీగలకు తగలడంతో కరెంటు షాక్ తో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

జరిగిన ఘటనపై గ్రామస్తులు ఆందోళనకు దిగారు.. గత కొన్ని రోజుల నుంచి ఇక్కడ విద్యుత్ వైర్లు కిందికి వేలాడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోలేదని, విద్యుత్‌ అధికారులు సకాలంలో స్పందించి వైర్లను సరి చేసి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని గ్రామస్తులు, బాలుడు తల్లిదండ్రులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు.. అధికారుల నిర్లక్ష్యమే పసివాడి ప్రాణం తీసిందంటూ స్థానికులు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..