Business Idea: సైడ్ ఇన్‌కమ్ కోసం చూస్తున్నారా.? మీ దుకాణంలోనే సెట్ చేసుకునే బెస్ట్ బిజినెస్
మీరు ఇప్పటికే వ్యాపారం చేస్తున్నారా.? మీకున్న దుకాణంలో సైడ్ ఇన్ కమ్ కోసం ప్లాన్ చేస్తున్నారా.? అయితే ఒక మంచి బిజినెస్ ఐడియా అందుబాటులో ఉంది. ప్రస్తుతం మీరు నిర్వహిస్తున్న వ్యాపారంలో యాడ్ ఆన్ బిజినెస్ గా పనిచేసే ఈ వ్యాపారం ఏంటి.? ఇందులో ఎలాంటి లాభాలు ఉంటాయి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రస్తుతం ఆర్థిక అవసరాలు మారిపోతున్నాయి. రోజురోజుకు ఖర్చులు భారీగా పెరిగిపోతున్నాయి. దీంతో ఒక్క వ్యాపారం చేస్తే సరిపోని రోజులు వచ్చేశాయ్. దీంతో చాలా మంది సైడ్ ఇన్‌కమ్ కోసం ఆలోచిస్తున్నారు. తాము అప్పటికే సంపాదిస్తున్న దాంతో పాటు మరికొంత మొత్తం అదనంగా ఆదాయం పొందుతున్నారు.
మీకు ఇప్పటికే ఒక వ్యాపారం ఉండి, మరికొంత ఆదాయం ఆర్జించాలనుకునే వారికి ఒక బెస్ట్ బిజినెస్ ఐడియా గురించి ఈరోజు తెలుసుకుందాం. సాధారణంగా కిరాణం దుకాణం నిర్వహించే వారు సైడ్‌గా కూల్ డ్రింక్స్‌ను కూడా విక్రయిస్తుంటారు. ఇలాగే సైడ్ ఇన్‌కమ్‌గా మరో బిజినెస్‌ను కూడా సెట్ చేసుకోవచ్చు. అదే గోలా ఐస్ వ్యాపారం. బండ్లపై ఐస్‌ను విక్రయించే వాళ్లను చూసే ఉంటాం.
ఐస్ క్యూబ్స్‌ను క్రష్ చేసి దానిపై ఫ్లెవర్స్‌ను యాడ్ చేసి ఇస్తుంటారు. ఒకప్పుడు ఇలాంటివి రోడ్లపై ఎక్కువగా కనిపించేవి. కానీ ఇప్పుడు పెద్దగా కనబడడం లేదు. అయితే మారిన టెక్నాలజీతో పాటు గోలా ఐస్ తయారీ మిషిన్స్ కూడా మారిపోయాయి. చాలా చిన్నగా మారి అందుబాటులోకి వచ్చాయి. వీటిని కొనుగోలు చేసి మీకు ఇప్పటికే ఉన్న దుకాణంలో ఏర్పాటు చేసుకుంటే మరిన్ని లాభాలు పొందే అవకాశాలు ఉంటాయి.
ఇందుకోసం ఐస్ స్లష్ మిషిన్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కేవలం ఫ్లేవర్‌ను మిషిన్‌లో పోస్తే చాలా ఐస్ కూడా అవసరం లేకుండా ఐస్ బయటకు వస్తుంది. ఇందులో కూల్ డ్రింక్స్ మొదలు పండ్ల రసాల వరకు వేసుకోవచ్చు. ఈ మిషిన్ ఖరీదు రూ. 70 వేల ప్రారంభ ధరతో అందుబాటులో ఉన్నాయి. ఒక్కో గోల్ ఐస్‌ను రూ. 20 చొప్పున విక్రయించుకోవచ్చు. సైడ్ ఇన్‌కమ్‌గా మంచి లాభాలు ఆర్జించవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..