AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎనిమిదో రోజు ‘వెన్నముద్దల బతుకమ్మ’.. వాయనంగా నువ్వులు, బెల్లం!

తెలంగాణ సంస్కృతికి ఆనవాలు బతుకమ్మ పండుగ.. ఆడపడచుల పండుగ బతుకమ్మ… తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు జీవన విధానానికి ప్రతీకగా నిలుస్తుందీ పండుగ… 9 రోజుల పాటు తెలంగాణలోని ప్రతీ వీధిలో ఎక్కడ చూసినా సందడే కనిపిస్తూ ఉంటుంది. మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యే సంబురాలు 9వ రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్థాయి. ఈ ఏడాది సెప్టెంబరు 28న బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. అక్టోబరు 6 వరకు జరగనున్నాయి. ఇప్పటికే ఏడు రోజుల బతుకమ్మ వేడుకలు ముగిశాయి. వాటిలో ఎంగిలిపువ్వు […]

ఎనిమిదో రోజు 'వెన్నముద్దల బతుకమ్మ'.. వాయనంగా నువ్వులు, బెల్లం!
TV9 Telugu Digital Desk
|

Updated on: Oct 05, 2019 | 11:09 PM

Share

తెలంగాణ సంస్కృతికి ఆనవాలు బతుకమ్మ పండుగ.. ఆడపడచుల పండుగ బతుకమ్మ… తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు జీవన విధానానికి ప్రతీకగా నిలుస్తుందీ పండుగ… 9 రోజుల పాటు తెలంగాణలోని ప్రతీ వీధిలో ఎక్కడ చూసినా సందడే కనిపిస్తూ ఉంటుంది. మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యే సంబురాలు 9వ రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్థాయి. ఈ ఏడాది సెప్టెంబరు 28న బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. అక్టోబరు 6 వరకు జరగనున్నాయి. ఇప్పటికే ఏడు రోజుల బతుకమ్మ వేడుకలు ముగిశాయి. వాటిలో ఎంగిలిపువ్వు బతుకమ్మ, అటుకల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ వేడకలు ముగిశాయి.

ఇక బతుకమ్మ పండుగలో 8వ రోజును ‘వెన్నముద్దల బతుకమ్మ’గా బతుకమ్మను ఆరాధిస్తారు. ఈరోజు తంగేడు, గునుగు, చామంతి, గులాబీ, గడ్డి పువ్వు, మొదలైన పువ్వులతో ఎనిమిది అంతరాలను బతుకమ్మగా పేర్చి ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఆట, పాటలతో బతుకమ్మ ఆడి చెరువులో బతుకమ్మను నిమజ్జనం చేస్తారు. ఈరోజు వాయనంగా నువ్వులు, బెల్లం కలిపి ప్రసాదంగా పెడుతారు.

Follow Us
ఏపీ, తెలంగాణకు వర్షసూచన.. ఈ ప్రాంతాల ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక
ఏపీ, తెలంగాణకు వర్షసూచన.. ఈ ప్రాంతాల ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక
పరగడుపున ఉప్పు నీళ్లు తాగుతున్నారా? శరీరంలో జరిగే మార్పులివే..
పరగడుపున ఉప్పు నీళ్లు తాగుతున్నారా? శరీరంలో జరిగే మార్పులివే..
‘యేషనాగుల కట్టమీద' సాంగ్‌కు శ్రీముఖి తీన్మార్ స్టెప్పులు.. వీడియో
‘యేషనాగుల కట్టమీద' సాంగ్‌కు శ్రీముఖి తీన్మార్ స్టెప్పులు.. వీడియో
ఈ రాశుల వారు శుభవార్తలు వింటారు.. గురువారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే
ఈ రాశుల వారు శుభవార్తలు వింటారు.. గురువారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే
బంగారం ధరలు భారీగా డౌన్.. ప్రస్తుతం తులం ఎంతంటే..?
బంగారం ధరలు భారీగా డౌన్.. ప్రస్తుతం తులం ఎంతంటే..?
జస్ట్ రెండు స్పూన్స్ తింటే.. చచ్చుబడిన నరాలు కూడా బలంగా
జస్ట్ రెండు స్పూన్స్ తింటే.. చచ్చుబడిన నరాలు కూడా బలంగా
'పంజా' సెకెండ్ హీరోయిన్ ఇప్పుడెలా మారిపోయిందో చూశారా? ఫొటోస్
'పంజా' సెకెండ్ హీరోయిన్ ఇప్పుడెలా మారిపోయిందో చూశారా? ఫొటోస్
స్వీట్లపై మెరిసే వెండి పూత ఏంటో తెలుసా? తింటే సేఫేనా.. అసలు విషయం
స్వీట్లపై మెరిసే వెండి పూత ఏంటో తెలుసా? తింటే సేఫేనా.. అసలు విషయం
ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్..
ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్..
ఎల్‌నినో మాయాజాలమా? పర్యావరణంలో మార్పులా?
ఎల్‌నినో మాయాజాలమా? పర్యావరణంలో మార్పులా?