పక్షులను వదిలిందని.. ఎనిమిదేళ్ల బాలికను చంపిన యాజమని..!

అమ్మకానికి ఉంచిన చిలుకలను వదిలేసిందన్న కారణంగా ఎనిమిదేళ్ల చిన్నారిపై యజమాని విచక్షణ మరిచి చావబాదాడు. తీవ్రంగా గాయపడ్డ చిన్నారి చికిత్స పొందుతూ కనుమూసింది

పక్షులను వదిలిందని.. ఎనిమిదేళ్ల బాలికను చంపిన యాజమని..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 04, 2020 | 4:40 PM

రాను రానూ మనుషుల్లో మనవత్వం మంటగలుస్తోంది. పంజరంలోంచి చిలకలు పారిపోయాయంటూ ఎనిమిదేళ్ల బాలికను చిదిమేశారు. ఆ కుటుంబ పంజరంలో బంధీ అయిన ఆ చిన్నారి యాజమాని చేతిలో ప్రాణాలొదిలింది. పాకిస్థాన్‌లోని రావల్పిండిలో జరిగిన ఈ ఘటన అందరి హృదయాలను కలిచివేసింది. అమ్మకానికి ఉంచిన చిలుకలను వదిలేసిందన్న కారణంగా ఎనిమిదేళ్ల చిన్నారిపై యజమాని విచక్షణ మరిచి చావబాదాడు. తీవ్రంగా గాయపడ్డ చిన్నారి చికిత్స పొందుతూ కనుమూసింది. రావల్పిండికి చెందిన దంపతులు పక్షుల వ్యాపారం చేస్తుంటారు. వివిధ ప్రాంతాల్లో దొరికే పక్షులను విక్రయిస్తుంటారు. అయితే ఆ వ్యాపారి ఇంట్లో 8 ఏళ్ల బాలిక జాహ్రా నాలుగు నెలల క్రితం పనిలో చేరింది. ఆదివారం ఆమె పంజరాలను శుభ్రం చేస్తుండగా అందులో ఉన్న చిలుకలు ఎగిరిపోయాయి. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన వ్యాపారి, అతడి భార్య చిన్నారిని చితకబాదారు. విచక్షణ రహితంగా కొట్టడంతో చిన్నారి తీవ్రంగా గాయపడింది. దీంతో బాలికను బేగం అక్తర్ రుక్సానా మెమోరియల్ ఆసుపత్రిలో చేర్చారు. ఆస్పత్రిలో చేర్పించిన కొద్దిసేపటికే చిన్నారి ప్రాణాలు వదిలినట్టు స్థానిక పోలీసులు తెలిపారు. జాహ్రా మరణానికి కారణమైన దంపతులిద్దర్నీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పసిపిల్ల అనే కనికరం లేని కర్కోటకులను కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.