బాణాసంచా కర్మాగారంలో పేలుళ్లు.. 8 మంది మృతి
ఉత్తరప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. బాణాసంచా కర్మాగారంలో పేలుళ్లు సంభవించడంతో 8 మంది మరణించారు. మరో 20 మంది గాయపడ్డారు. ఆదివారం ఘజియాబాద్ లో బాణాసంచా కర్మాగారంలో కార్మికులు పనిచేస్తుండగా ఒక్కసారిగా ఈ దుర్ఘటన జరిగింది. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు.

ఉత్తరప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. బాణాసంచా కర్మాగారంలో పేలుళ్లు సంభవించడంతో 8 మంది మరణించారు. మరో 20 మంది గాయపడ్డారు. ఆదివారం ఘజియాబాద్ లో బాణాసంచా కర్మాగారంలో కార్మికులు పనిచేస్తుండగా ఒక్కసారిగా ఈ దుర్ఘటన జరిగింది. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని భావిస్తున్నారు.
ఘజియాబాద్ లోని మోదీ నగర్ తహసీల్ పరిధిలో బార్ఱ్వాన్ గ్రామంలోని బాణాసంచా కర్మాగారంలో ఆదివారం మధ్యాహ్నం పేలుళ్లు సంభవించాయి. పేలుళ్లు సంభవించిన సమయంలో ఫ్యాక్టరీలో మొత్తం 30 మంది కార్మికులు పని చేస్తున్నారని పోలీసులు తెలిపారు. పేలుళ్ల ధాటికి మంటలు ఎగిసిపడటంతో.. కార్మికులు బయటకు పారిపోయేందుకు ప్రయత్నించారు. అప్పటికే మంటలు వ్యాపించడంతో కొందరు సజీవదహనం అయ్యారని పోలీసులు తెలిపారు. బాణసంచా పేలుళ్ల ధాటికి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. మంటల వ్యాప్తి నేపథ్యంలో ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసి మృతదేహాలను వెలికితీశారు. డెడ్ బాడీలను పోస్ట్ మార్టంకు తరలించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అయితే, గత ఐదేళ్లుగా బాణాసంచా ఫ్యాకర్టీని అక్రమంగా నిర్వహిస్తున్నట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ అక్రమ ఫ్యాక్టరీపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ నిర్వాహకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.
ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ స్పందించారు. ఘటనలో గాయపడిన వారికి అత్యవసర వైద్య చికిత్స అందించాలని అధికారులను సూచించారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరిపి ఈ సాయంత్రం నాటికి నివేదిక సమర్పించాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు.
उ.प्र. CM ने गाजियाबाद के मोदीनगर के बखरवा गांव में मोमबत्ती कारखाने में आग लगने की घटना में DM एवं वरिष्ठ पुलिस अधीक्षक को मौके पर पहुंचकर घटना के घायलों को तत्काल राहत पहुंचाने के निर्देश दिए हैं और घटनास्थल की जांच कर आज शाम तक रिपोर्ट प्रस्तुत करने को कहा है: उत्तर प्रदेश CMO https://t.co/IP7vHb8SmG pic.twitter.com/eYZWst7J3R
— ANI_HindiNews (@AHindinews) July 5, 2020
मोदी नगर में एक फैक्ट्री में हुए धमाके में 7 लोगों की मौत, 4 घायल: अजय शंकर पांडे, जिला मजिस्ट्रेट गाजियाबाद pic.twitter.com/vkqN6DTFUO
— ANI_HindiNews (@AHindinews) July 5, 2020




