జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది అక్టోబరు-నవంబరులో నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ యోచిస్తోంది. జమ్మూకశ్మీర్ రాష్ట్రంలో అక్టోబరు-డిసెంబరు నెలల్లో ఎన్నికల నిర్వహణ అనుకూలం. గతంలో 1983, 1987లలోనూ ఆ నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల నిర్వహణపై ఎన్నికల కమిషన్ కేంద్ర హోంమంత్రిత్వశాఖతో సంప్రదించింది. ప్రస్థుతం జమ్మూకశ్మీర్ రాష్ట్రం రాష్ట్రపతి పాలనలో ఉన్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై న్యాయనిపుణుల సలహా కోరాలని కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. అమరనాథ్ యాత్ర, యాపిల్స్ సీజన్ ల దృష్ట్యా వాటి అనంతరం అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఈసీ అధికారులు యోచిస్తున్నారు. జమ్మూకశ్మీర్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై కేంద్ర హోంమంత్రిత్వశాఖ నివేదిక పంపించాలని ఎన్నికల అధికారులు కోరారు.
ఈ ఏడాది చివర్లో కశ్మీర్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది. అమర్‌నాథ్ యాత్ర ముగిసిన తరువాత ఎన్నికల షెడ్యుల్ ఖరారు చేయనున్నట్లు తెలిపింది.
Election Commission: Commission will keep on regularly and on real time basis monitoring the situation in Jammu and Kashmir, taking inputs from all necessary quarters and after the conclusion of Amarnath Yatra will announce poll schedule. https://t.co/pVRcFs7nH6
— ANI (@ANI) June 4, 2019