AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Summer Dehydration: మండే ఎండల్లో నీరసించిపోతున్నారా? ఈ పండ్లు తిన్నారంటే రోజంతా ఫుల్ ఖుష్‌

వేసవిలో చాలా మందికి నిస్సత్తువగా అలసిపోయినట్లు అనిపిస్తుంది. ఈ సమయంలో శరీరాన్ని ఎంత చల్లగా, తాజాగా ఉంచుకోవడానికి చాలా మంది శీతల పానియాలు, కొబ్బరి నీళ్లు వంటివి తీసుకుంటూ ఉంటారు. అయితే ఎండలో చెమట రూపంలో ఒంట్లోని నీరంతా ధారగా కారుతుంది. దీని కారణంగా డీహైడ్రేషన్ సమస్య తలెత్తుతుంది..

Summer Dehydration: మండే ఎండల్లో నీరసించిపోతున్నారా? ఈ పండ్లు తిన్నారంటే రోజంతా ఫుల్ ఖుష్‌
Fruits For Summer Dehydration
Srilakshmi C
|

Updated on: Apr 09, 2026 | 9:08 PM

Share

వేసవిలో మండే ఎండలు త్వరగా శక్తిని కోల్పోయేలా చేస్తాయి. దీంతో నిస్సత్తువగా అలసిపోయినట్లు అనిపిస్తుంది. ఈ సమయంలో శరీరాన్ని ఎంత చల్లగా, తాజాగా ఉంచుకోవడానికి చాలా మంది శీతల పానియాలు, కొబ్బరి నీళ్లు వంటివి తీసుకుంటూ ఉంటారు. అయితే ఎండలో చెమట రూపంలో ఒంట్లోని నీరంతా ధారగా కారుతుంది. దీని కారణంగా డీహైడ్రేషన్ సమస్య తలెత్తుతుంది. వేసవిలో వచ్చే ఈ సమస్య నుంచి బయటపడటానికి అధిక నీటితో పాటు కొన్ని రకాల పండ్లను కూడా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పండ్లను తినడం ద్వారా శరీరంలో తగినంత నీటి శాతాన్ని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది.

డీహైడ్రేషన్ (శరీరంలో నీటి శాతం తగ్గడం) నివారణకు ఈ పండ్లు తినండి

నారింజ పండ్లు

నారింజ పండ్లు నీరు అధిక శాతం ఉండే పండ్లు. వీటిల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. వీటిలోని అధిక నీటి శాతం వేడి వాతావరణంలో శరీరానికి మంచి హైడ్రేషన్‌ను అందిస్తుంది. అంతేకాకుండా వాటిలోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

పుచ్చకాయ

వేసవిలో డీహైడ్రేషన్‌ను నివారించడానికి, శరీరంలో నీటి శాతాన్ని నిలుపుకోవడానికి పుచ్చకాయలను తినడం మంచి ఎంపిక. ఇందులో 92 శాతం నీరు ఉంటుంది. కాబట్టి ఇది వేసవికి అనువైన పండు. ఇది శరీరానికి తేమను అందించడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది.

ఇవి కూడా చదవండి

స్ట్రాబెర్రీలు

స్ట్రాబెర్రీలు తినడానికి రుచికరంగా ఉండటమే కాకుండా వాటిలో మంచి మొత్తంలో నీరు కూడా ఉంటుంది. విటమిన్ సిచ యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల స్ట్రాబెర్రీలు శరీరాన్ని ఫ్రీ రాడికల్ నష్టం నుంచి, వేడి నుంచి కాపాడతాయి.

పనస పండు

వేసవిలో దొరికే సీజనల్ పండ్లలో పనస ముఖ్యమైనది. ఇది మంచి సువాసనతో పాటు ఎన్నో మేలు చేసే పోషకాలు దండిగా కలిగి ఉంటుంది. తినడానికి ఈ పండు రుచికరంగా ఉండటమే కాకుండా, శరీరానికి తేమను కూడా అందిస్తుంది. అంతేకాకుండా అనాస పండులో మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ముఖ్యమైన పోషకాలు దండిగా ఉంటాయి.

కీరదోస

కీరదోసలో 96 శాతం నీరు ఉంటుంది. ఇది శరీరానికి మంచి హైడ్రేషన్‌ను అందిస్తుంది. కాబట్టి ఈ వేసవిలో ప్రతిరోజూ కీరదోస సలాడ్‌, లేదా జ్యూస్‌ ఎలా తీసుకున్నా మంచిదే.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us