దుబ్బాక బైపోల్: హైదరాబాద్‌ లో హైటెన్షన్‌.!

రేపు (నవంబర్ మూడోతేదీ) దుబ్బాక ఉపఎన్నిక జరుగుతుంటే, రాజధాని హైదరాబాద్‌లో ఇవాళ హైటెన్షన్ నెలకొంది. నిన్న భాగ్యనగరంలో పట్టుబడ్డ కోటి రూపాయలు దుబ్బాక ఓటర్లకు పంచేందుకు తీసుకెళ్తున్నట్లు పోలీసులు ప్రకటించగా, బీజేపీ తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తోంది. అటు, టీఆర్ఎస్ పార్టీ బీజేపీపై ఫిర్యాదుల పరంపరకు సిద్ధమైంది. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీజేపీ అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని వ్యాఖ్యలు చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. టీఆర్ఎస్, బీజేపీ ప్రధాన కార్యాలయాల దగ్గర పోలీసులు భారీ బందోబస్తు […]

దుబ్బాక బైపోల్: హైదరాబాద్‌ లో హైటెన్షన్‌.!
Follow us

|

Updated on: Nov 02, 2020 | 10:55 AM

రేపు (నవంబర్ మూడోతేదీ) దుబ్బాక ఉపఎన్నిక జరుగుతుంటే, రాజధాని హైదరాబాద్‌లో ఇవాళ హైటెన్షన్ నెలకొంది. నిన్న భాగ్యనగరంలో పట్టుబడ్డ కోటి రూపాయలు దుబ్బాక ఓటర్లకు పంచేందుకు తీసుకెళ్తున్నట్లు పోలీసులు ప్రకటించగా, బీజేపీ తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తోంది. అటు, టీఆర్ఎస్ పార్టీ బీజేపీపై ఫిర్యాదుల పరంపరకు సిద్ధమైంది. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీజేపీ అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని వ్యాఖ్యలు చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. టీఆర్ఎస్, బీజేపీ ప్రధాన కార్యాలయాల దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే, బీజేపీ మాత్రం కేటీఆర్ వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుబడుతోంది. అల్లర్లు సృష్టించే సంప్రదాయం తమది కాదంటోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాలనుంచి టీవీ9 ఎక్స్ క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ మీకోసం.  ఎలాగైనా గెలిచి తీరాలన్న కసి..దుబ్బాక బైపోల్‌లో ఇప్పుడు క్యాష్ డ్రామా