దుబ్బాక :ఆరు, ఏడు, ఎనిమిది రౌండ్లలో సత్తాచాటిన టీఆర్ఎస్

సిద్దిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల కౌంటింగ్ లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా, ఇప్పటి వరకు ముగిసిన వరుసగా మొదటి ఐదు రౌండ్లలో జరిగిన కౌంటింగ్‌లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆధిక్యాన్ని కొనసాగించగా, ఆరు, ఏడు, ఎనిమిది రౌండ్లలో టీఆర్ఎస్ తన సత్తా చాటుతోంది. ఆరవ రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత 355 ఓట్ల ఆధిక్యంలో కొనసాగారు. అయితే అదే ఆధిక్యాన్ని ఏడు, […]

దుబ్బాక :ఆరు, ఏడు, ఎనిమిది రౌండ్లలో సత్తాచాటిన టీఆర్ఎస్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 10, 2020 | 2:50 PM

సిద్దిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల కౌంటింగ్ లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా, ఇప్పటి వరకు ముగిసిన వరుసగా మొదటి ఐదు రౌండ్లలో జరిగిన కౌంటింగ్‌లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆధిక్యాన్ని కొనసాగించగా, ఆరు, ఏడు, ఎనిమిది రౌండ్లలో టీఆర్ఎస్ తన సత్తా చాటుతోంది. ఆరవ రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత 355 ఓట్ల ఆధిక్యంలో కొనసాగారు. అయితే అదే ఆధిక్యాన్ని ఏడు, ఎనిమిదో రౌండ్‌లలో కూడా టీఆర్ఎస్ కొనసాగించింది. ఎనిమిదో రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి 200 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఏడో రౌండ్ ముగిసేసరికి ఫలితాలు ఇలా ఉన్నాయి. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ : 22,762 ఓట్లు, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుజాత : 20,277 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డి : 4,003 ఓట్లు సాధించారు.