తప్పక చూడండి… మీ అభిమాన థియేటర్లలో .. ! 50 రూపాయలకే..!

కరోనా వైరస్‌ తీవ్రంగా వ్యాప్తి చెందుతుండటంతో ఆ మహమ్మారిని కంట్రోల్‌ చేయడం కోసం ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను విధించాయి.. ఆ తర్వాత నెమ్మదిగా ఆంక్షలను తొలగిస్తూ వచ్చాయి..

తప్పక చూడండి... మీ అభిమాన థియేటర్లలో .. ! 50 రూపాయలకే..!
Follow us
Balu

|

Updated on: Nov 10, 2020 | 12:01 PM

కరోనా వైరస్‌ తీవ్రంగా వ్యాప్తి చెందుతుండటంతో ఆ మహమ్మారిని కంట్రోల్‌ చేయడం కోసం ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను విధించాయి.. ఆ తర్వాత నెమ్మదిగా ఆంక్షలను తొలగిస్తూ వచ్చాయి.. ఈ మధ్యనే థియేటర్లు కూడా ఓపెన్‌ చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం చెప్పింది.. అయితే ఇది రాష్ట్రాల ఇష్టానికి వదిలేసింది.. కొన్ని రాష్ట్రాలలో సినిమా థియేటర్లు ఓపెన్‌ అయ్యాయి.. కొన్ని రాష్ట్రాలు ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు.. ఓపెన్‌ అయిన సినిమా థియేటర్లకు కూడా జనాలు పెద్దగా రావడం లేదు.. కరోనా భయమే వారిని ఇంటిపట్టున ఉండేట్టు చేస్తోంది.. మళ్లీ ప్రేక్షకులు థియేటర్ల బాట పట్టడం ఇప్పట్లో అయ్యే పని కాదు.. సినిమా అంటే ఇష్టపడే వారిని థియేటర్లకు రప్పించానికి ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ ఓ ఆలోచన చేసింది.. యాభై ఏళ్లుగా యశ్‌రాజ్‌ సంస్థ ఎన్నో జనరంజకమైన చిత్రాలను నిర్మించింది.. వాటిల్లో ప్రేక్షకుల విశేష ఆదరణ పొందిన కొన్ని చిత్రాలను ఏరి మళ్లీ థియేటర్లలో విడుదల చేయాలనుకుంటోంది.. అది కూడా చాలా తక్కువ ధరకే! ఇంతకు ముందు థియేటర్లలో రెడ్యూస్డూ రేట్లతో పాత సినిమాలను ప్రదర్శించేవారు.. ఇప్పుడా సంప్రదాయం మళ్లీ వస్తుందన్నమాట! దీపావళి పండుగ సందర్భంగా యశ్‌రాజ్‌ సంస్థ కొన్ని సినిమాలను థియేటర్లలో విడుదల చేస్తోంది.. నవంబర్‌ 12 నుంచి 19 వరకు ఈ సినిమాలను పీవీఆర్‌, ఐనాక్స్‌, సినీపాలీస్‌ మల్టీప్లెక్స్‌లలో విడుదల చేస్తున్నారు.. టికెట్‌ ధర కేవలం 50 రూపాయలే.. ఇంత తక్కువ ధరలో మల్టీప్లెక్స్‌ ఎక్స్‌పీరియన్స్‌తో సినిమాలు చూసే అవకాశం వస్తుంది కాబట్టి ప్రేక్షకులు థియేటర్లకు వెళతారా? ఎలాగూ టీవీలలో వస్తున్నాయి కాబట్టి ఇంటిపట్టునే ఉండి చూడ్డానికి ఇష్టపడతారా ? అన్నది చూడాలి. యశ్‌రాజ్‌ నుంచి వచ్చిన సినిమాలో బ్లాక్‌బ్లాస్టర్‌ సినిమా దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే.. ఈ సినిమా సాధించిన రికార్డులు ఎన్నో! వెయ్యి రోజుల పాటు ఆడిన సినిమా కూడా ఇదే.. ఇటీవలే ఈ సినిమా పాతికేళ్లను పూర్తి చేసుకుంది.. ఈ సినిమాతో పాటు కభీకభీ, సిల్‌సిలా, దిల్‌ తో పాగల్‌హై, వీర్‌జారా, బంటీ ఔర్ బబ్లీ, రబ్నే బనాది జోడి, ఏక్‌థా టైగర్‌, బ్యాండ్‌ బాజా భరాత్‌, సుల్తాన్‌, వార్‌, మద్దానీ సినిమాలు మల్టీప్లెక్స్‌లో రిలీజ్‌ కాబోతున్నాయి..