జో బైడెన్ ను చిక్కుల్లో పడేస్తున్న ట్రంప్, రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్ కి ఉద్వాసన

అమెరికా ఎన్నికల్లో తన ఓటమిని అంగీకరించని డొనాల్డ్ ట్రంప్.. ప్రెసిడెంట్ గా ఎన్నికైన జో బైడెన్ ని చిక్కుల్లో పడేయడమే ధ్యేయంగా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది.

జో బైడెన్ ను చిక్కుల్లో పడేస్తున్న ట్రంప్, రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్ కి ఉద్వాసన
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Nov 10, 2020 | 12:21 PM

అమెరికా ఎన్నికల్లో తన ఓటమిని అంగీకరించని డొనాల్డ్ ట్రంప్.. ప్రెసిడెంట్ గా ఎన్నికైన జో బైడెన్ ని చిక్కుల్లో పడేయడమే ధ్యేయంగా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. ఇందుకు నిదర్శనంగా రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్ ని పదవి నుంచి తొలగించారు. అతడ్ని టర్మినేట్ చేస్తున్నా.. అతడు అందించిన సేవలకు కృతజ్ఞతలు అని ఆయన పేర్కొన్నారు. మార్క్ స్థానే నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ హెడ్ క్రిస్టోఫర్ మిల్లర్ ను రక్షణ మంత్రిగా నియమించారు. మార్క్ సుమారు 16 నెలల పాటు పదవిలో కొనసాగారు. చైనా ముప్పు నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా యుఎస్ డిఫెన్స్ పోశ్చర్ ని ‘రీ-షేప్ ‘చేయడానికి  ఆయన ప్రయత్నించారు. అయితే దేశంలో సివిల్ అన్ రెస్ట్ (ప్రజా ఆందోళనలను) అణచివేయడానికి ఫెడరల్ ట్రూప్స్ ని వినియోగించాలన్న తన సూచనను వ్యతిరేకించడంవల్ల   మార్క్ పై ట్రంప్ ఆగ్రహంతో ఉన్నారు. ఆలాగే ఆఫ్ఘనిస్థాన్ లో పూర్తిగా అమెరికా భద్రతాదళాలు ఉపసంహరించాలన్న తన నిర్ణయాన్ని అమలు పరచడంలో మార్క్ జాప్యం చేశారన్న కోపం కూడా ఆయనపై ఉంది. ఇక ఇప్పుడు బైడెన్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారన్న తన కసిని ట్రంప్… మార్క్ ఎస్పర్ పై చూపారు.