భీమవరంలో డ్రగ్స్ కలకలం..అంతా సినీ ఫ‌క్కీలో..

|

Jun 19, 2020 | 1:01 PM

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో డ్రగ్స్ జాడ‌లు క‌ల‌క‌లం రేపాయి. మాద‌క ద్ర‌వ్యాలు వినియోగిస్తున్న ఓ ఇంజినీరింగ్ స్టూడెంట్ ను చెన్నై కస్టమ్స్ ఆఫిస‌ర్స్ అరెస్టు చేశారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన తాజాగా బయటకు వ‌చ్చింది. దీంతో భీమవరం ప్ర‌జ‌లు ఒక్క‌సారిగా షాక్ కి గురయ్యారు.

భీమవరంలో డ్రగ్స్ కలకలం..అంతా సినీ ఫ‌క్కీలో..
Follow us on

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో డ్రగ్స్ జాడ‌లు క‌ల‌క‌లం రేపాయి. మాద‌క ద్ర‌వ్యాలు వినియోగిస్తున్న ఓ ఇంజినీరింగ్ స్టూడెంట్ ను చెన్నై కస్టమ్స్ ఆఫిస‌ర్స్ అరెస్టు చేశారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన తాజాగా బయటకు వ‌చ్చింది. దీంతో భీమవరం ప్ర‌జ‌లు ఒక్క‌సారిగా షాక్ కి గురయ్యారు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… చెన్నై విమానాశ్రయానికి వచ్చిన సరకు విమానంలోని పార్సిల్స్ ను కస్టమ్స్ ఆఫిస‌ర్స్ చెకింగ్ చేశారు. నెదర్లాండ్‌ నుంచి వెస్ట్ గోదావ‌రి జిల్లా భీమవరంలోని అడ్ర‌స్ కు వచ్చిన పార్శిల్‌పై అందులో పిల్ల‌ల టాయ్స్ ఉన్నట్లు రాసి ఉంది. అనుమానం క‌ల‌గ‌డంతో అధికారులు పార్శిల్ తెరిచి చూడగా 400 మత్తు బిల్ల‌లు లభ్యమయ్యాయి. వాటి విలువ రూ.12 లక్షలు ఉంటుందని అధికారులు అంచ‌నా వేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. భీమవరానికి చెందిన ఓ వ్య‌క్తి ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసి వాటిని తెప్పించినట్లు ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేల్చారు. పార్శిల్‌పై పేర్కొన్న అడ్ర‌స్ కు వెళ్లి ఇంజినీరింగ్ కంప్లీట్ చేసిన‌ యువకుడు(27)ని అరెస్టు చేసి చెన్నై విమానాశ్రయ కస్టమ్స్ ఆఫీసుకు తీసుకొచ్చారు. అనంతరం అతన్ని కోర్టులో హాజరుపరచి, పుళల్‌ జైలుకు తరలించారు.