స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌పై డీబీటీతో రెడ్డీస్ ల్యాబ్ డీల్
భారత్‌లో కరోనా వైరస్ నిర్మూలనకు స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కోసం బయోటెక్నాలజీ శాఖ (డీబీటీ)తో రెడ్డీస్ జట్టు కట్టింది.
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి తరిమికొట్టేందుకు తెలంగాణకు చెందిన డ్రగ్స్ కంపెనీలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. తాజాగా భారత్‌లో కరోనా వైరస్ నిర్మూలనకు స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కోసం బయోటెక్నాలజీ శాఖ (డీబీటీ)తో రెడ్డీస్ జట్టు కట్టింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ డీబీటీ ఆధ్వర్యంలోని బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రిసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ లిమిటెడ్ గురువారం ప్రకటించింది. డీబీటీ, బీఐఆర్‌ఏసీలు స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ప్రయోగశాల పరీక్షల్లో తమకు తగిన సలహాలు, సూచనలు ఇస్తాయని ఓ ప్రకటనలో సంస్థ పేర్కొంది. అలాగే, ఈ భాగస్వామ్యంలో భాగంగా బీఐఆర్‌ఏసీకి చెందిన పలు క్లినికల్ ట్రయల్ సెంటర్లను వినియోగించుకుంటామని స్పష్టం చేసింది. బీఐఆర్‌ఏసీతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు రెడ్డీస్ ల్యాబ్ చైర్మన్ సతీశ్ రెడ్డి. ప్రపంచంలోనే తొలి వ్యాక్సిన్ గా చెప్పుకునే స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌ను రష్యా సంస్థ అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దేశంలో ఈ వ్యాక్సిన్‌ను మనుషులపై పరీక్షించేందుకు రెడ్డీస్, రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌కు డీజీసీఐ అనుమతులిచ్చింది. మార్చి నాటికి తుది దశ ట్రయల్స్ పూర్తవుతాయని రెడ్డీస్ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. అన్ని ప్రయోగాలు పూర్తయ్యాక మార్చి తర్వాత వ్యాక్సిన్ ను అందుబాటులో తీసుకురావాలని రెడ్డీస్ ల్యాబ్ భావిస్తోంది.