Bigg Boss 4: కొత్త కెప్టెన్‌గా అరియానా
బిగ్‌బాస్ 4లో గురువారం కెప్టెన్సీ టాస్క్ జరిగింది. ఈ సారి కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఆడవారికి మాత్రమే ఇచ్చారు బిగ్‌బాస్. అయితే వారిని కెప్టెన్ చేసే బాధ్యతను హౌజ్‌లోని
Bigg Boss 4 Ariyana: బిగ్‌బాస్ 4లో గురువారం కెప్టెన్సీ టాస్క్ జరిగింది. ఈ సారి కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఆడవారికి మాత్రమే ఇచ్చారు బిగ్‌బాస్. అయితే వారిని కెప్టెన్ చేసే బాధ్యతను హౌజ్‌లోని మగవారికి ఇచ్చారు. గార్డెన్ ఏరియాలో ఒక కీ, బాక్స్ ఇచ్చి దాన్ని చేజిక్కించుకున్న వాళ్లు.. తమకు నచ్చిన ఆడవారికి దాన్ని ఇవ్వాలని బిగ్‌బాస్ వెళ్లడించారు.
ఈ క్రమంలో మొదటి కీని అఖిల్ దక్కించుకోగా.. మోనాల్ అని ఫిక్స్ అయిపోయాడు. ఈ విషయంలో మిగిలిన మహిళా సభ్యులు అతడిని కన్వెన్స్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ.. అఖిల్ మాత్రం మోనాల్‌కి కీ ఇచ్చాడు. దీంతో మోనాల్‌కి కెప్టెన్ పోటీదారుల్లో ఒకరిని బయటకు పంపే ఛాన్స్ వచ్చింది. దీంతో కెప్టెన్ టాస్క్ నుంచి హారికను బయటకు పంపింది. దీంతో హారిక చాలా ఫీల్ అయ్యింది. ముఖం మాడ్చుకుని ఆమె కూర్చుంది. (ఘోర రోడ్డు ప్రమాదం..పెళ్లివ్యాను బోల్తా పడి ఆరుగురు మృతి)
ఇక రెండో కీని మెహబూబ్ దక్కించుకోవడంతో ఆ కీని అరియానాకు ఇచ్చాడు. అయితే లాస్య కెప్టెన్ కాకుండా చేయమని అరియానా చెవిలో మెహబూబ్ వెల్లడించాడు. దీంతో నా ఆట నేను ఆడతా అంటూ లాస్య ఫొటో ఉన్న యాపిల్‌ని అరియానా పీకేసి కోసేసింది. ఆ తరువాత మూడో రౌండ్‌లో కీ రాజశేఖర్ మాస్టర్‌కి రాగా.. అతడు కూడా అరియానాకు ఇచ్చాడు. దీంతో మోనాల్ ఫొటో కింద ఉన్న యాపిల్‌ని పీకిపారేసి కొత్త కెప్టెన్ అయ్యింది అరియానా.
దీంతో లాస్య ఫీల్ అయ్యింది. కానీ బయటకు మాత్రం నవ్వుతూ కనిపించింది. నేను కెప్టెన్ అవ్వడం నీకు ఇష్టమేనా అని అరియానా లాస్యను అడిగింది. చాలా హ్యాపీగా ఉందని చెబుతూ లోపల మాత్రం బాగా ఫీల్ అయ్యింది.(భారీ డంప్ స్వాధీనం)