Bigg Boss 4: మాస్టర్ కక్కుర్తి.. అరియానాతో గొడవ
కొత్త కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న అరియానా.. రేషన్ మేనేజర్‌గా మోనాల్‌ని ఎంచుకుంది. దీంతో అమ్మరాజశేఖర్ మాస్టర్ ఫీల్ అయ్యారు.
Ariyana Amma Rajasekhar master: కొత్త కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న అరియానా.. రేషన్ మేనేజర్‌గా మోనాల్‌ని ఎంచుకుంది. దీంతో అమ్మరాజశేఖర్ మాస్టర్ ఫీల్ అయ్యారు. తాను నామినేషన్‌లో ఉన్నానని.. రేషన్ మేనేజర్‌గా ఇస్తే తనకు సపోర్ట్ అయ్యేదని అర్థం పర్థం లేని మాటలు మాట్లాడాడు. నీకు సపోర్ట్ చేసి తప్పుచేశా.. కష్టపడి నేను నిన్ను కెప్టెన్ చేస్తే మోనాల్‌ని రేషన్ మేనేజర్ చేస్తావా..? నేను మోనాల్‌కి సపోర్ట్ చేసి ఉండాల్సింది అంటూ ఏవేవో మాట్లాడుతూ అసహనం ప్రదర్శించాడు. (Bigg Boss 4: కొత్త కెప్టెన్‌గా అరియానా)
మీరు ఇప్పటికే రెండు సార్లు రేషన్ మేనేజర్ అయ్యారు. ఇప్పుడు మోనాల్‌కి ఛాన్స్ ఇచ్చాను. అయినా రేషన్ మేనేజర్‌గా ఉంటే సేవ్ అవుతారని ఎక్కడా లేదు అని అరియానా అర్థమయ్యేలా చెప్పింది. అయినా మాస్టర్ వినిపించుకోకుండా.. నువ్వు చేసిన పనికి నాకు చెప్పుతో కొట్టినట్లుగా ఉంది అంటూ పెద్ద పెద్ద మాటలే మాట్లాడాడు. ఈ గొడవతో కెప్టెన్ అయిన ఎంజాయ్ చేసే అవకాశం అరియానాకు కాసేపు కూడా ఇవ్వలేదు మాస్టర్. (ఏపీ ఇంటర్ విద్యార్థలుకు మరో అవకాశం.. రిజిస్ట్రేన్ల గడువు పొడిగింపు)