Telangana municipal department: ఓ వైపు కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. దీని కట్టడికోసం లాక్ డౌన్ పొడిగించిన విషయం విదితమే. తెలంగాణలో ఈ వైరస్ కట్టడికోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న జీహెచ్ ఎంసీ, రంగారెడ్డి, మేడ్చల్ పరిధిలోని ఇళ్లలోకి పనిమనుషులకు అనుమతి లేదంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిధిలోని గేటెడ్ కమ్మ్యూనిటీలకు, అన్ని అపార్ట్ మెంట్ లకు ఈ నిబంధన వర్తిస్తుందని పేర్కొంది. తప్పనిసరి అయితే మాత్రం మునిసిపల్ ఆఫీసు నుండి నో ఆబ్జెక్షన్ లెటర్ తీసుకోవాలని స్పష్టంచేసింది.
Also Read: కర్నూలులో టెన్షన్.. ఒకే కుటుంబంలో ఏకంగా ఐదుగురికి కరోనా..