ఆ లింక్ క్లిక్ చేసారో… మీ ఖాతా ఖాళీ!

ఆ లింక్ క్లిక్ చేసారో... మీ ఖాతా ఖాళీ!

ఆధునిక ప్రపంచంలో సైబర్ నేరగాళ్లు.. రోజుకో కొత్త మోసానికి పాల్పడుతున్నారు. ఏటీఎం కార్డు బ్లాక్ అయిందని, లాటరీ వచ్చిందని, రుణం ఇప్పిస్తామంటూ.. ఇలా మాయ మాటలు చెప్పి డబ్బులు కాజేస్తున్నారు. తాజాగా ఐటీ రిఫండ్ అంటూ మోసాలకు పాల్పడుతున్నారు. ఆదాయపన్నుకు సంబంధించిన ఈ ఫైలింగ్‌లో మీకు రూ. 20 వేలు రిఫండ్ వచ్చింది.. మేం పంపించే లింక్‌ను మీరు క్లిక్ చేసి కావల్సిన సమాచారం ఇస్తే.. మీ డబ్బులు మీకొస్తాయంటూ వల వేస్తున్నారు. ఈ వలలో చిక్కితే […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Sep 04, 2019 | 8:44 AM

ఆధునిక ప్రపంచంలో సైబర్ నేరగాళ్లు.. రోజుకో కొత్త మోసానికి పాల్పడుతున్నారు. ఏటీఎం కార్డు బ్లాక్ అయిందని, లాటరీ వచ్చిందని, రుణం ఇప్పిస్తామంటూ.. ఇలా మాయ మాటలు చెప్పి డబ్బులు కాజేస్తున్నారు. తాజాగా ఐటీ రిఫండ్ అంటూ మోసాలకు పాల్పడుతున్నారు. ఆదాయపన్నుకు సంబంధించిన ఈ ఫైలింగ్‌లో మీకు రూ. 20 వేలు రిఫండ్ వచ్చింది.. మేం పంపించే లింక్‌ను మీరు క్లిక్ చేసి కావల్సిన సమాచారం ఇస్తే.. మీ డబ్బులు మీకొస్తాయంటూ వల వేస్తున్నారు. ఈ వలలో చిక్కితే బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతాయని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఆదాయపన్ను చెల్లించే వారి వివరాలను సైబర్‌నేరగాళ్లు ఎలా సంపాదిస్తున్నారనే విషయంపై ఇప్పుడు సైబర్‌క్రైమ్ పోలీసులు దృష్టి పెట్టారు. వివిధ బ్యాంకుల డేటానే సంపాదిస్తున్న సైబర్‌నేరగాళ్లు.. ఆదాయపన్ను చెల్లించేవారి వివరాలను కూడా అదే పద్ధతిలో సేకరిస్తున్నారని పోలీసులు భావిస్తున్నారు.

సైబర్ నేరగాళ్లు వివిధ పద్ధతుల్లో అమాయకులను మోసం చేస్తుంటారు. సీజన్‌ను బట్టి వారి ప్లాన్ మారుతుంది. ఇటీవల ఆదాయపన్ను రిటర్న్స్ తేదీ గడువు ముగిసింది. చాలామంది వ్యాపారులు, ఉద్యోగులు ఆయా రిటర్న్స్ దాఖలు చేసి ఉంటారు. దీంతో వారికి మెసేజ్‌లు పంపిస్తుంటారు. సైబర్‌నేరగాళ్లు పంపించే లింక్‌ను క్లిక్ చేయగానే ఒక ఫారం వస్తుంది. అందులో బ్యాంకు వివరాలు పొందుపరచాలని సూచిస్తారు. అందులో బ్యాంకు వివరాలను నింపిన వెంటనే సెల్‌ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. అది కూడా చెప్పగానే .. ఆ బ్యాంకు ఖాతాలో నుంచి డబ్బులను సైబర్ నేరగాళ్లు కాజేస్తారు. క్షణాల వ్యవధిలోనే ఈ తంతును ముగించేస్తారు.

ఇన్‌కం ట్యాక్స్ డిపార్టుమెంట్ నుంచి మెసేజ్ పంపిస్తున్నామంటూ కొందరి సెల్‌ఫోన్లకు మెసేజ్‌లు వస్తున్నాయి. సైబర్‌నేరాలపై అవగాహన ఉన్నవారు ఇది మోసమని గుర్తిస్తున్నారు. అవగాహన లేనివారు, వచ్చిన మెసేజ్ నిజమని ఆ లింక్‌ను క్లిక్ చేసే అవకాశాలున్నాయని పోలీసులు పేర్కొంటున్నారు. గురుత్తెలియని వ్యక్తులు పంపించే ఎలాంటి లింక్‌లను కూడా క్లిక్ చేయవద్దని పోలీసులు సూచిస్తున్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu