కోవిడ్ బారినపడ్డ జూనియర్‌ ట్రంప్‌..ప్రస్తుతం క్వారంటైన్..నో సింటమ్స్

అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్‌ పెద్ద కుమారుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్ కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం క్వారంటైన్‌ ఉంటోన్న ఆయన నిబంధనలు పాటిస్తున్నారని...

కోవిడ్ బారినపడ్డ జూనియర్‌ ట్రంప్‌..ప్రస్తుతం క్వారంటైన్..నో సింటమ్స్

అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్‌ పెద్ద కుమారుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్ కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం క్వారంటైన్‌ ఉంటోన్న ఆయన నిబంధనలు పాటిస్తున్నారని…ఇప్పటివరకు ఎలాంటి సింటమ్స్ లేవని అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ప్రెసిడెంట్ ట్రంప్‌, ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్‌ సహా వారి సంతానం బారెన్ ‌ఎన్నికలకు ముందే కోవిడ్ బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. తండ్రి తరఫున జూనియర్‌ ట్రంప్‌ ఇటీవల ముగిసిన అధ్యక్ష ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేశారు. ఎన్నికల రోజు సాయంత్రం జరిగిన ఓ ప్రైవేటు విందులో పాల్గొన్న ఆయన ఫేస్ మాస్క్‌ ధరించలేదు. ఆ విందులో పాల్గొన్న దాదాపు 250 మంది ఎలాంటి కొవిడ్‌ నిబంధనలు పాటించలేదన్న ఆరోపణలు ఉన్నాయి.

వీరితో పాటు శ్వేతసౌధంలో పలువురు ఉన్నతాధికారులు, సిబ్బంది సైతం వైరస్‌ బారిన పడ్డారు. శుక్రవారం ఆండ్రూ జ్యులియాని అనే ఓ ఉన్నతాధికారికి కోరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఆయన తండ్రి రూడీ జ్యులియాని ట్రంప్‌నకు వ్యక్తిగత న్యాయవాదిగా పనిచేస్తున్నారు. కరోనా కట్టడి చేయడంలో ట్రంప్ ప్రభుత్వం విఫలమైందని భారీ విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. అంతెందుకు కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న సమయంలో కూడాా ఆయన మాస్క్ ధరించేందుకు విముఖత చూపారు. ట్రంప్ ఓటమికి ఈ కారణాలు కూడా భాగమయ్యాయి అన్నది నిపుణుల విశ్లేషణ.

Also Read :

ఈమె అందంతో కుర్రకారు షేక్, రెమ్యూనరేషన్‌తో ప్రొడ్యూసర్లు షాక్ !

సాయం చేస్తే మోసం..చంపుతామని బెదిరింపులు..పోలీసులను ఆశ్రయించిన వందేమాతరం