సాయం చేస్తే మోసం..చంపుతామని బెదిరింపులు..పోలీసులను ఆశ్రయించిన వందేమాతరం

తెలిసిన పరిచయంతో ఒక వ్యక్తికి డబ్బు సాయం చేసిన ప్రముఖ సంగీత దర్శకులు, గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ లేని పోని చిక్కుల్లో పడ్డారు.

సాయం చేస్తే మోసం..చంపుతామని బెదిరింపులు..పోలీసులను ఆశ్రయించిన వందేమాతరం
Follow us

|

Updated on: Nov 21, 2020 | 10:58 AM

తెలిసిన పరిచయంతో ఒక వ్యక్తికి డబ్బు సాయం చేసిన ప్రముఖ సంగీత దర్శకులు, గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ లేని పోని చిక్కుల్లో పడ్డారు. ఆయన డబ్బులు తిరిగి చెల్లించకపోగా..చంపుతామంటూ బెదిరింపులకు దిగారు. దీంతో వందేమాతరం బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించగా..నిందితులపై కేసు నమోదైంది. ‌

ఇన్‌స్పెక్టర్‌ కళింగరావు చెప్పిన వివరాల ప్రకాారం.. ఫిలింనగర్‌లో నివసించే వందేమాతరం శ్రీనివాస్‌ అలియాస్‌ కె.శ్రీనివాస్‌రావుకు బంజారాహిల్స్‌లోని కేబీఆర్‌ పార్క్‌లో వాకింగ్‌కు వెళ్లిన సమయంలో ఫిలింనగర్‌లోని అపోలో ఆసుపత్రి దగ్గర్లో నివసించే తిరుపతయ్యతో పరిచయం ఏర్పడింది. 2018 జూన్‌లో తిరుపతయ్య కర్నూలు జిల్లా నందికొట్కూరుకి చెందిన వ్యాపారస్థుడు అయిన తన మామ రంగస్వామితో కలిసి వందేమాతరం శ్రీనివాస్‌ను కలిశారు. తన వ్యాపార విస్తరణ కోసం రూ.30లక్షలు కావాలని కోరాడు. మూడు, నాలుగు నెలల్లో తిరిగి ఇస్తానని నమ్మించారు. దీంతో ఆయన పలు దఫాలుగా డబ్బు అందించారు. వారు తిరిగి డబ్బులు ఇవ్వకుండా మాయమాటలు చెబుతూ కాలం వెళ్లదీస్తున్నారు. నెల రోజుల క్రితం వందేమాతరం శ్రీనివాస్ తన మిత్రుడైన మధుసూదన్‌రెడ్డితో కలిసి తిరుపతయ్య ఇంటికి వెళ్లి తన డబ్బులు ఇవ్వాలని కోరారు. దీంతో అతను చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో బాధితుడు ఇచ్చిన కంప్లైంట్‌పై శుక్రవారం పోలీసులు తిరుపతయ్య, రంగస్వామిలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read : ఈమె అందంతో కుర్రకారు షేక్, రెమ్యూనరేషన్‌తో ప్రొడ్యూసర్లు షాక్ !