దేశంలో కొత్తగా 46,232 కరోనా కేసులు, 564 మరణాలు.. పెరుగుతోన్న రికవరీ శాతం..

దేశంలో గడచిన 24 గంటల్లో కొత్తగా 46,232 కరోనా కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 90,50,597కి చేరింది. వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో..

  • Ravi Kiran
  • Publish Date - 10:05 am, Sat, 21 November 20
దేశంలో కొత్తగా 46,232 కరోనా కేసులు, 564 మరణాలు.. పెరుగుతోన్న రికవరీ శాతం..

Corona Cases India: దేశంలో గడచిన 24 గంటల్లో కొత్తగా 46,232 కరోనా కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 90,50,597కి చేరింది. వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 4,39,747 మంది చికిత్స పొందుతుండగా.. ఇప్పటివరకు 84,78,124 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. నిన్న దేశవ్యాప్తంగా 564 మంది మృతి చెందటంతో మొత్తం ఇప్పటివరకు వైరస్ కారణంగా 1,32,726 మంది ప్రాణాలు కోల్పోయారు.

అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. పాజిటివ్ కేసుల కంటే రికవరీ రేటు అధికంగా ఉంటోందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో 49,715 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు పేర్కొంది. అటు నిన్న 10,66,022 టెస్టులు చేయగా.. మొత్తం దేశవ్యాప్తంగా టెస్టుల సంఖ్య 13.06 కోట్లకు చేరింది. దేశంలో సుమారు 93.67 శాతానికి రికవరీ రేటు చేరిందంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసులు 4.86 శాతానికి తగ్గాయి. మరణాలు రేటు 1.47 శాతానికి తగ్గింది.