Viral Video: డాల్ఫిన్‏ను పట్టుకోవడానికి పెంపుడు కుక్క తాపత్రాయం.. నవ్వులు పూయిస్తున్న వీడియో..

|

Jan 08, 2021 | 3:41 PM

స్నేహానికి జాతితో సంబంధం ఉండదు. మనుషుల మాదిరిగానే జంతువులు కూడా స్నేహం చేస్తాయన్న సంగతి తెలిసిందే. అయితే అవి వాటి జాతికి సంబంధిన జంతువులతో

Viral Video: డాల్ఫిన్‏ను పట్టుకోవడానికి పెంపుడు కుక్క తాపత్రాయం.. నవ్వులు పూయిస్తున్న వీడియో..
Follow us on

స్నేహానికి జాతితో సంబంధం ఉండదు. మనుషుల మాదిరిగానే జంతువులు కూడా స్నేహం చేస్తాయన్న సంగతి తెలిసిందే. అయితే అవి వాటి జాతికి సంబంధిన జంతువులతో కాకుండా ఇతర జాతికి చెందిన జంతువులతోనూ అంతే స్నేహంగా ఉంటాయి. అయితే ఆ రెండు స్నేహితులలో ఒకటి భూమ్మీద నివసించేది, మరోకటి నీళ్ళలో నివసించే ప్రాణి అయితే ఏలా?. అదేలా కుదురుతుంది అనుకుంటున్నారా. నిజమేనండి ఇక్కడ ఓ పెంపుడు కుక్క మరియు డాల్ఫిన్ స్నేహితులయ్యాయి. ఎంతో హూషారుగా, జాలిగా ఒకదాని వెంట మరోకటి పరుగెడుతూ ఆడుకుంటున్నాయి. ప్రస్తుతం వాటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పెంపుడు కుక్కలు ఎంతా చలాకీగా ఉంటాయో మనకు తెలిసిన విషయమే. అవి చేసే అల్లరితో నవ్విస్తాయి. తాజాగా ఒక చోట డాల్ఫిన్, పెంపుడు కుక్క పిల్ల చేసిన పని కూడా అక్కడున్న వారికి నవ్వులు తెప్పించాయి. ఓ భారీ ఆక్వేరియంలో ఉన్న డాల్ఫిన్, అక్కడకు వచ్చిన ఓ పెంపుడు కుక్కను ఆటపట్టిస్తూ ఉంటుంది. ఆ కుక్క కూడా డాల్ఫిన్ ఎటు వెళ్ళినా.. దాని వెంటే పరిగెడుతూ ఉంది. దీంతో ఆ డాల్ఫిన్ దానిని ఇంకా ఆటపట్టిస్తూ.. అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇక ఆ డాల్ఫిన్‎ను పట్టుకోవాలని ఆ కుక్క చేసే హడావుడి చూస్తే నవ్వులు తెప్పిస్తుంది. చివరికి రెండింటింకి ఎలా మచ్చిక కుదిరిందో తెలియాదు కానీ ఆక్వేరియం నుంచే ఆ దానికి ముద్దు ఇచ్చేస్తుంది డాల్ఫిన్. అవి రెండు ఆడిన ఆటను అక్కడున్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

Also Read:

Viral News: వామ్మో.. లేడిస్ హాస్టల్లోకి దూరిన చిరుతపులి.. గదుల దగ్గరకు వెళ్ళి చివరకు.. వీడియో వైరల్..

Viral News: దొంగగారి మహా తెలివి.. చూస్తే ఎవ్వరయిన షాక్ అవ్వాల్సిందే.. నెట్టింట్లో వీడియో వైరల్..