AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సంక్రాంతి కోడిపందేలకు వస్తే అంతే సంగతి.. లాడ్జి, గెస్ట్ హౌస్ లు బుక్ చేసుకోవద్దని వినతి, ఇన్‌కంట్యాక్స్ రైడ్స్ చేస్తారుట.!

సంక్రాంతి పండుగ పురస్కరించుకుని పశ్చిమగోదావరి జిల్లాలో కోడి పందేలు , పేకాట , గుండాట వంటి ఎటువంటి జూదములకు అనుమతి లేదని తేల్చి..

సంక్రాంతి కోడిపందేలకు వస్తే అంతే సంగతి.. లాడ్జి, గెస్ట్ హౌస్ లు బుక్ చేసుకోవద్దని వినతి, ఇన్‌కంట్యాక్స్ రైడ్స్ చేస్తారుట.!
Venkata Narayana
|

Updated on: Jan 08, 2021 | 3:23 PM

Share

సంక్రాంతి పండుగ పురస్కరించుకుని పశ్చిమగోదావరి జిల్లాలో కోడి పందేలు , పేకాట , గుండాట వంటి ఎటువంటి జూదములకు అనుమతి లేదని తేల్చి చెప్పారు పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు. పశ్చిమగోదావరి జిల్లాలో ముందుగా లాడ్జ్ రూమ్స్, గెస్ట్ హౌస్ రూమ్ బుకింగ్ చేసుకున్న వారు కేవలం కోడిపందేలు, గుండాట, ఇంకా జూదము కొరకు వచ్చేటట్లు అయితే, దయచేసి రావద్దని ప్రకటన విడుదల చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో కోవిడ్ వేవ్, బర్డ్ ఫ్లూ వచ్చే అవకాశాలు ఉన్న దృష్ట్యా ఈ మేరకు విజ్ఞప్తి చేస్తున్నామని వెల్లడించారు.

“మీరు సదుద్దేశంతో పండుగకు పశ్చిమగోదావరి జిల్లా వచ్చినట్లయితే పశ్చిమగోదావరి పోలీసు వారు సంతోషంగా స్వాగతం పలుకుతాము.. మీరు ఇక్కడికి వచ్చిన తరువాత చట్టాన్ని అతిక్రమించినట్లయితే కఠిన చర్యలు తప్పవు, అంతేకాదు, మీ మీద పోలీస్ క్రిమినల్ కేసులు పెట్టబడతాయి. మీరు చట్ట వ్యతిరేక కార్యకలాపాలైన జూదము, పేకాట, కోడి పందేలు కొరకు వచ్చినట్లయితే మీ పైన ఇన్ కం టాక్స్ రైడ్స్ నిర్వహించబడతాయి. అందువలన మీరు, మీ కుటుంబ సభ్యులతో పండుగ ఇంటివద్దనే జరుపుకోవాలని కోరుకుంటూ కేవలం కోడిపందాలు, పేకాట, గుండాట కొరకు ప్రత్యేకంగా పశ్చిమగోదావరి రావాల్సిన అవసరం లేదు. ఒకవేళ వచ్చే ఉద్దేశం ఉంటే ఆ ఆలోచన మానుకుని కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని.. సాంప్రదాయ సంక్రాంతికి నాంది పలకాలని కోరుకుంటున్నాము”. అని పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు హెచ్చరించారు.