ఒక్క జిఫ్‌‌తో.. మీ వాట్సాప్‌ హ్యాక్ అయినట్లే..!

సోషల్ మీడియా యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడూ కొత్త అప్డేట్స్.. సరికొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటూ వచ్చింది. అయితే ఇప్పుడు ఆ వాట్సాప్‌లో మాల్‌వేర్ బగ్ ప్రవేశించింది. ఇక ఈ బగ్ వల్ల సెక్యూరిటీ సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. యూజర్లు తమ వాట్సాప్ అకౌంట్లలో రోజు ఎన్నో రకాల ఫోటోలను, వీడియోలు, మెసేజ్‌లు, జిఫ్‌ ఫైల్స్‌ను పంపిస్తుంటారు. వీటికి ఇప్పుడు హ్యాకర్ల నుంచి ముప్పు పొంచి ఉన్నట్లు సైబర్ సెల్ హెచ్చరిస్తోంది. ఈ మాల్‌వేర్ బగ్.. […]

ఒక్క జిఫ్‌‌తో.. మీ వాట్సాప్‌ హ్యాక్ అయినట్లే..!
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 06, 2019 | 6:17 PM

సోషల్ మీడియా యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడూ కొత్త అప్డేట్స్.. సరికొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటూ వచ్చింది. అయితే ఇప్పుడు ఆ వాట్సాప్‌లో మాల్‌వేర్ బగ్ ప్రవేశించింది. ఇక ఈ బగ్ వల్ల సెక్యూరిటీ సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. యూజర్లు తమ వాట్సాప్ అకౌంట్లలో రోజు ఎన్నో రకాల ఫోటోలను, వీడియోలు, మెసేజ్‌లు, జిఫ్‌ ఫైల్స్‌ను పంపిస్తుంటారు. వీటికి ఇప్పుడు హ్యాకర్ల నుంచి ముప్పు పొంచి ఉన్నట్లు సైబర్ సెల్ హెచ్చరిస్తోంది.

ఈ మాల్‌వేర్ బగ్.. ఫేక్ కంటెంట్ల ద్వారా ఫోన్ డివైస్‌లో ప్రవేశిస్తుందని.. దీనితో విలువైన డేటాను హ్యాకర్లు చోరీ చేస్తారని చెబుతున్నారు. అందువల్ల బగ్ ‌ఇష్యూ ఫిక్స్ అయ్యేవరకు ఎటువంటి అనుమానాస్పదమైన, ఫేక్ న్యూస్ లింకులను షేర్ చేయొద్దని సైబర్ సెల్ అధికారులు యూజర్లను విజ్ఞప్తి చేస్తున్నారు. అంతేకాక ప్రతి ఒక్కరు వాట్సాప్ వెర్షన్‌ను అప్డేట్ చేసుకున్న తర్వాత జిఫ్‌లను షేర్ చేయాలని సూచించారు. వాట్సాప్ వెర్షన్ 2.19.244 లో ఈ బగ్ ఉన్నట్టు గుర్తించారు. ఈ వెర్షన్ వాడే యూజర్లను వెంటనే కొత్త వెర్షన్ అప్ డేట్ చేసుకోవాలని సూచించింది.