‘ప్యాన్ ఇండియా’ మైకంలో హీరోలు.. లబోదిబోమంటున్న నిర్మాతలు!

ప్యాన్ ఇండియా.. ఈ మధ్యకాలంలో నిర్మాతల నోటి వెంట వస్తున్న ఒకే పదం ఇది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా చాలామంది హీరోలు తమ సినిమాలు ప్యాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ అయ్యేలా చూసుకుంటున్నారు. కొన్ని హిట్ అవుతున్నా.. మరికొన్ని డిజాస్టర్లు కావడం సహజం. స్టార్ హీరోలతో వందల కోట్ల బడ్జెట్‌తో సినిమాలు తీసి.. వాటిని ప్యాన్ ఇండియా లెవెల్‌లో ప్రమోట్ చేస్తే ఒక అర్ధం ఉంటుంది. ఎందుకంటే వారి ఇమేజ్‌కు తగ్గట్టు ప్రపంచవ్యాప్తంగా సుపరిచితం కాబట్టి […]

'ప్యాన్ ఇండియా' మైకంలో హీరోలు.. లబోదిబోమంటున్న నిర్మాతలు!
Follow us

|

Updated on: Sep 14, 2019 | 5:33 PM

ప్యాన్ ఇండియా.. ఈ మధ్యకాలంలో నిర్మాతల నోటి వెంట వస్తున్న ఒకే పదం ఇది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా చాలామంది హీరోలు తమ సినిమాలు ప్యాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ అయ్యేలా చూసుకుంటున్నారు. కొన్ని హిట్ అవుతున్నా.. మరికొన్ని డిజాస్టర్లు కావడం సహజం. స్టార్ హీరోలతో వందల కోట్ల బడ్జెట్‌తో సినిమాలు తీసి.. వాటిని ప్యాన్ ఇండియా లెవెల్‌లో ప్రమోట్ చేస్తే ఒక అర్ధం ఉంటుంది. ఎందుకంటే వారి ఇమేజ్‌కు తగ్గట్టు ప్రపంచవ్యాప్తంగా సుపరిచితం కాబట్టి కొంత మార్కెట్ ఉంటుంది. దానితో సినిమా ఓపెనింగ్స్ రూపంలో నిర్మాతలు గట్టెక్కే పరిస్థితి ఉంటుంది. దానికి సరైన ఉదాహరణ తాజాగా ప్రభాస్ హీరోగా వచ్చిన ‘సాహో’ సినిమా.

‘బాహుబలి’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఫాలోయింగ్ సంపాదించిన ప్రభాస్.. ఆ సినిమా తర్వాత ‘సాహో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అతడికి ఉన్న క్రేజ్‌తో ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ తారాస్థాయిలో జరిగింది. అంతేకాకుండా ఓపెనింగ్ కలెక్షన్స్‌లో కూడా సరికొత్త రికార్డులు సృష్టించింది. అయితే సినిమాలో కథ, కథనం లేకపోవడం.. ఓన్లీ యాక్షన్ సీన్స్‌తోనే దాదాపు మూడు గంటలు దర్శకుడు చిత్రాన్ని నడిపించడంతో ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనను ఎదుర్కోవల్సి వచ్చింది. కానీ ప్రభాస్ ఫాలోయింగ్ దృష్ట్యా సినిమా నష్టాలను మూటగట్టుకోకుండా.. లాభాలు బాట పట్టింది. దాదాపు ప్రపంచవ్యాప్తంగా 424 కోట్ల వసూళ్లు సాధించిన ఈ చిత్రం నిర్మాతలను సేఫ్ జోన్‌లోకి తీసుకొచ్చిందని చెప్పవచ్చు.

అలా కాకుండా మీడియం బడ్జెట్ సినిమాలు చేస్తున్న అప్ కమింగ్ హీరోలు సైతం ఈ ప్యాన్ ఇండియా మోజులో పడిపోయి కథలను, కంటెంట్‌ను వదిలేసి.. కేవలం పబ్లిసిటీతో వసూళ్లు వచ్చేస్తాయన్న భ్రమలో ఉన్నారనిపిస్తోంది. దీని మీద ఫిలింనగర్‌లో పెద్ద చర్చే జరుగుతోంది. స్టార్ హీరోలు అయితే ఓకే గానీ.. అప్ కమింగ్ హీరోలకు ఈ ప్యాన్ ఇండియా మూవీస్ వర్కౌట్ కావని టాలీవుడ్ పెద్దల మాట. ఇది ఇలా ఉంటే ఎక్కువగా బాలీవుడ్ వాళ్ళు తమ సినిమాల్లో కంటెంట్ లేకపోయినా.. హీరో క్రేజ్ దృష్ట్యా మిగతా భాషల్లో విడుదల చేసి చేతులు కాల్చుకోవడం చూస్తూనే ఉన్నాం.

కథలో కంటెంట్.. హీరో ఇమేజ్ బట్టి ప్యాన్ ఇండియా మూవీ‌ని నిర్మాతలు ప్లాన్ చేస్తే బాగుంటుంది. అంతేగాని సరైన కంటెంట్ లేకుండా మూవీస్ తీసి చేతులు కాల్చుకుంటే.. మొదటికే మోసం వస్తుంది. మరోవైపు ఈ ప్యాన్ ఇండియా మోజులో పడి స్టార్ హీరోలు కూడా తమ తదుపరి చిత్రాలు అదే స్థాయిలో ఉండాలని భావిస్తున్నారు. తీరా ఆ సినిమాలు విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం పాలవుతున్నాయి. అందుకే ఈ ప్యాన్ ఇండియా మైకాన్ని వదిలేసి కాస్త కథల మీద కన్సన్ట్రేషన్ పెడితే బెటర్.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో