మట్టి గణేష్ ని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం: కేటీఆర్

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు మంత్రి కేటీ.రామారావు. ప్రజలందరూ మట్టి విగ్రహాలను పూజించాలని పిలుపునిచ్చారు. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో మట్టి గణేష్ విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. శుక్రవారం ప్రగతిభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు.

మట్టి గణేష్ ని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం: కేటీఆర్
Follow us

|

Updated on: Aug 14, 2020 | 9:02 PM

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు మంత్రి కేటీ.రామారావు. ప్రజలందరూ మట్టి విగ్రహాలను పూజించాలని పిలుపునిచ్చారు. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో మట్టి గణేష్ విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. శుక్రవారం ప్రగతిభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. ఇందులో భాగంగా తొలి వినాయక విగ్రహాన్ని హైదరాబాద్ నగర మేయర్ బొంతు రాంమోహన్‌కు అందజేశారు మంత్రి. ఈ ఏడాది కోవిడ్–19 పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా సామూహిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలన్న కేటీఆర్.. కొవిడ్ అంక్షలు అమలవుతున్నందున వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను ఎవరి ఇళ్లల్లో వారు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని ప్రలజకు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

కాగా, హుసేన్ సాగర్ శుద్ధి కార్యక్రమంలో భాగంగా రసాయనాల వాడకంపై హెచ్ఎండీఏ ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. గత ఎనిమిది సంవత్సరాలుగా సాంప్రదాయ మట్టి వినాయక విగ్రహాలను మట్టితో తయారు చేయించి స్వచ్చంధ సంస్థల ద్వారా ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తోంది. ఈ ఏడాది కూడా అలాగే మట్టి విగ్రహాలను పంపిణీ చేయాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది. హెచ్ఎండీఏ పరిధిలోని 32 సెంటర్లలో ఉచితంగా 50 వేల మట్టి వినాయక విగ్రహాల పంపిణీకి ఏర్పాట్లు చేశారు. మట్టి గణేష్‌ల పంపిణీ కేంద్రాల వివరాలను హెచ్ఎండీఏ వెబ్ సైట్‌లో ఉంచినట్లు అధికారులు తెలిపారు.