దిశ నిందితుల ఎన్‌కౌంటర్: ఎన్‌హెచ్‌ఆర్సీ రిపోర్ట్‌పై ఉత్కంఠ..!

‘దిశ’ నిందితుల ఎన్‌కౌంటర్‌పై జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎలాంటి ఉత్తర్వులు వెల్లడించనుందా.. అనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. హైదరాబాద్‌లోని చటాన్ పల్లి దిశపై హత్యాచారం అనంతరం నిందితులకు ఉరిశిక్ష విధించాలని.. పెద్ద ఎత్తున ర్యాలీలు, నిరసనలు జరిగిన విషయం తెలిసిందే. అనంతరం అందరికీ ట్విస్ట్‌ ఇస్తూ.. పోలీసులు నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడం.. ప్రజలు సంబరాలు చేసుకోవడం ఇలా జరిగిన అనంతరం.. జాతీయ మానవ హక్కుల కమిషన్ తెరపైకి వచ్చింది. దీంతో.. మళ్లీ ఈ ఘటనపై […]

దిశ నిందితుల ఎన్‌కౌంటర్: ఎన్‌హెచ్‌ఆర్సీ రిపోర్ట్‌పై ఉత్కంఠ..!
Follow us

| Edited By:

Updated on: Dec 11, 2019 | 7:10 PM

‘దిశ’ నిందితుల ఎన్‌కౌంటర్‌పై జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎలాంటి ఉత్తర్వులు వెల్లడించనుందా.. అనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. హైదరాబాద్‌లోని చటాన్ పల్లి దిశపై హత్యాచారం అనంతరం నిందితులకు ఉరిశిక్ష విధించాలని.. పెద్ద ఎత్తున ర్యాలీలు, నిరసనలు జరిగిన విషయం తెలిసిందే. అనంతరం అందరికీ ట్విస్ట్‌ ఇస్తూ.. పోలీసులు నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడం.. ప్రజలు సంబరాలు చేసుకోవడం ఇలా జరిగిన అనంతరం.. జాతీయ మానవ హక్కుల కమిషన్ తెరపైకి వచ్చింది.

దీంతో.. మళ్లీ ఈ ఘటనపై వివాదాలు రాజుకున్నాయి. నలుగురినీ ఎన్‌కౌంటర్ చేయడానికి కారణాలేంటని.. పోలీసులకు ప్రశ్నల తాకిడి మొదలైంది. అసలు ఎందుకు వారిని ఎన్‌కౌంటర్ చేయాల్సి వచ్చింది..? పోలీసుల బుల్లెట్స్ ఎక్కడ..? అక్కడ అసలు ఏం జరిగింది..? అనే  ఎన్‌హెచ్ఆర్సీ ప్రశ్నల జోరు ఊపందుకుంది. దీంతో.. తెలంగాణ ప్రభుత్వం ఈ ఘటనపై సిట్ కూడా వేసింది. కాగా.. ఈ ఘటనపై దిశ తల్లిదండ్రులను, ఆమెతో పనిచేసిన ఆస్పత్రిలోని ఉద్యోగులను, పోలీసులను విచారించింది ఎన్‌హెచ్‌ఆర్సీ.

కాగా.. 5 రోజుల పాటు హైదరాబాద్, మహబూబ్ నగర్‌లో విచారణ జరిపిన ఈ టీమ్.. మృతదేహాలున్న హాస్పిటల్, ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశాన్ని తనిఖీ చేశారు. తెలంగాణ పోలీసు అకాడమీలో కార్యాలయం ఏర్పాటు చేసుకుని పోలీసులని, రెవెన్యూ సిబ్బందిని, ఫోరెన్సిక్ వైద్యులను, నిందితుల తల్లిదండ్రులను, దిశ కుటుంబ సభ్యులను విచారించింది ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం. విచారణలో వెల్లడైన అంశాలను ఒక నివేదికలా తయారు చేసి జాతీయ మానవ హక్కుల కమిషన్‌కి కమిటీ సభ్యులు సమర్పించనున్నారు. ఈ నివేదిక ఆధారంగా తదుపరి ఉత్తర్వులు వెల్లడించనుంది ఎన్‌హెచ్‌ఆర్సీ.