AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ నటుడు చెప్పేవన్నీ వట్టి అబద్దాలే.. బిగ్ బాస్ కంటెస్టెంట్‌పై ఘాటు వ్యాఖ్యలు!

మొదట్లో అంతగా కిక్కివ్వలేదు గానీ.. చివరి అంకంకు చేరుకునేసరికి హిందీ బిగ్ బాస్ అద్భుతమైన ట్విస్టులతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా అర్హన్ ఖాన్, రష్మీ దేశాయ్ లవ్ ఎపిసోడ్స్ షోకి హయ్యస్ట్ టీఆర్పీ రేటింగ్స్ తీసుకొస్తున్నాయని చెప్పాలి. గత శనివారం వీకెండ్ కా వార్ సమయంలో సల్మాన్ ఖాన్.. హౌస్‌లోకి అడుగుపెట్టి రష్మీకి అర్హన్ ఖాన్ గతం గురించి వివరించిన సంగతి తెలిసిందే. ఈ టాపిక్ ఇంతటితో ఆగిపోవాలని.. మిగతా కంటెస్టెంట్లు ఎవరూ కూడా హౌస్‌లో […]

ఆ నటుడు చెప్పేవన్నీ వట్టి అబద్దాలే.. బిగ్ బాస్ కంటెస్టెంట్‌పై ఘాటు వ్యాఖ్యలు!
Ravi Kiran
|

Updated on: Dec 11, 2019 | 8:25 PM

Share

మొదట్లో అంతగా కిక్కివ్వలేదు గానీ.. చివరి అంకంకు చేరుకునేసరికి హిందీ బిగ్ బాస్ అద్భుతమైన ట్విస్టులతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా అర్హన్ ఖాన్, రష్మీ దేశాయ్ లవ్ ఎపిసోడ్స్ షోకి హయ్యస్ట్ టీఆర్పీ రేటింగ్స్ తీసుకొస్తున్నాయని చెప్పాలి. గత శనివారం వీకెండ్ కా వార్ సమయంలో సల్మాన్ ఖాన్.. హౌస్‌లోకి అడుగుపెట్టి రష్మీకి అర్హన్ ఖాన్ గతం గురించి వివరించిన సంగతి తెలిసిందే. ఈ టాపిక్ ఇంతటితో ఆగిపోవాలని.. మిగతా కంటెస్టెంట్లు ఎవరూ కూడా హౌస్‌లో చర్చించకూడదని సల్మాన్ వార్నింగ్ కూడా ఇచ్చాడు.

అయితే అర్హన్ ఖాన్ మాత్రం షెఫాలీ బగ్గాతో ఈ విషయంపై మాట్లాడుతూ.. ‘రష్మీని మొదటిసారి కలిసినప్పుడు.. తన దగ్గర చిల్లిగవ్వ లేదని.. పూర్తిగా రోడ్డున ఉందని చెప్పాడు’. అయితే రష్మీ బ్రదర్ గౌరవ్ ఈ వ్యాఖ్యలపై స్పందించాడు. తన సోదరి ఎప్పుడూ కూడా రోడ్డున పడలేదని గట్టిగా సమాధానమిచ్చాడు.  గౌరవ్ రీసెంట్‌ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు.

తన సోదరి ఎప్పుడూ కూడా రోడ్డున పడలేదని.. అర్హన్ ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడో తనకు అర్ధం కావట్లేదని అన్నాడు. కేవలం తన సోదరి పరువు తీయడానికే అర్హన్ చవకబారు వ్యాఖ్యలు చేస్తున్నాడంటూ మండిపడ్డాడు. వీకెండ్ ఎపిసోడ్‌లో రష్మీకి జరిగిన దానికే చాలా బాధపడుతున్నాం. ఇప్పుడు అర్హన్ ఖాన్ చెప్పే ఇలాంటి మాటలకు ఫ్యామిలీ అంతా తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు’ అని గౌరవ్ వివరించాడు. తన సోదరి రష్మీ గతంలోనే చాలా బాధను అనుభవించిందని… మళ్ళీ ఇప్పుడు అలాంటి సిట్యువేషన్ ఫేస్ చేస్తే తాము తట్టుకోలేమని గౌరవ్ వాపోయాడు. ఇక సల్మాన్ ఖాన్ ఎంత చెప్పినా.. అర్హన్ ఆ ప్రస్తావన తేవడం జరిగింది కాబట్టి.. ఈ వారం ఎలా రియాక్ట్ అవుతాడో వేచి చూడాలి.

Follow Us
తగ్గుతున్న బంగారం ధరలు..! హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే
తగ్గుతున్న బంగారం ధరలు..! హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే
Horoscope Today: మెరుగ్గా ఆ రాశుల వారి ఆర్థిక పరిస్థితి..
Horoscope Today: మెరుగ్గా ఆ రాశుల వారి ఆర్థిక పరిస్థితి..
ప్రోటీన్ సప్లిమెంట్లు: శరీరానికి లాభమా, హానికరమా? నిజాలు తెలుసుకో
ప్రోటీన్ సప్లిమెంట్లు: శరీరానికి లాభమా, హానికరమా? నిజాలు తెలుసుకో
ఎంత బావుందో అని మీరు తెగ తింటున్నారు.. కానీ అసలు యవ్వారం ఇది..
ఎంత బావుందో అని మీరు తెగ తింటున్నారు.. కానీ అసలు యవ్వారం ఇది..
ఉగాది శుభకార్యాలు: ఇలా చేస్తే ఏడాదంతా లక్ష్మీ కటాక్షం.. డబ్బు లో
ఉగాది శుభకార్యాలు: ఇలా చేస్తే ఏడాదంతా లక్ష్మీ కటాక్షం.. డబ్బు లో
తెలుగు రాష్ట్రాల లేటెస్ట్ వెదర్ రిపోర్ట్...
తెలుగు రాష్ట్రాల లేటెస్ట్ వెదర్ రిపోర్ట్...
గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం.. హాజరయ్యే సినీ ప్రముఖులు వీరే
గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం.. హాజరయ్యే సినీ ప్రముఖులు వీరే
పాదాల్లో ఈ లక్షణాలున్నాయా?.. డయాబెటిస్‌ను ముందే కనిపెట్టేయండి
పాదాల్లో ఈ లక్షణాలున్నాయా?.. డయాబెటిస్‌ను ముందే కనిపెట్టేయండి
ఉగాది స్పెషల్: నిమిషాల్లోనే 3 సులభమైన డెలిషియస్ రెసిపీలు..!
ఉగాది స్పెషల్: నిమిషాల్లోనే 3 సులభమైన డెలిషియస్ రెసిపీలు..!
కనిపించని నెలవంక.. భారత్‌లో ఈద్ ఎప్పుడంటే..?
కనిపించని నెలవంక.. భారత్‌లో ఈద్ ఎప్పుడంటే..?