సిటిజన్ షిప్ బిల్లు.. అస్సాంలో ‘ అగ్నిజ్వాలలు ‘.. కర్ఫ్యూ విధింపు

పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ అస్సాంలో బుధవారం వేలాది మంది నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. పోలీసులతో ఘర్షణకు దిగారు. పలు చోట్ల టైర్లకు నిప్పంటించి రాకపోకలను అడ్డుకున్నారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. బాష్పవాయువు ప్రయోగించారు. బుధవారం రాత్రి ఏడు గంటలనుంచి రాష్ట్రంలోని 10 జిల్లాల్లో మొబైల్, ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేశారు. ఈ ఆంక్షలు 24 గంటల పాటు అమల్లో ఉంటాయి. అటు-ముందు జాగ్రత్త చర్యగా కర్ఫ్యూ విధించారు.  కాగా- పరిస్థితిని అదుపు చేసేందుకు సైన్యాన్ని […]

సిటిజన్ షిప్ బిల్లు.. అస్సాంలో ' అగ్నిజ్వాలలు '.. కర్ఫ్యూ విధింపు
Pardhasaradhi Peri

|

Dec 11, 2019 | 7:37 PM

పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ అస్సాంలో బుధవారం వేలాది మంది నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. పోలీసులతో ఘర్షణకు దిగారు. పలు చోట్ల టైర్లకు నిప్పంటించి రాకపోకలను అడ్డుకున్నారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. బాష్పవాయువు ప్రయోగించారు. బుధవారం రాత్రి ఏడు గంటలనుంచి రాష్ట్రంలోని 10 జిల్లాల్లో మొబైల్, ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేశారు. ఈ ఆంక్షలు 24 గంటల పాటు అమల్లో ఉంటాయి. అటు-ముందు జాగ్రత్త చర్యగా కర్ఫ్యూ విధించారు.  కాగా- పరిస్థితిని అదుపు చేసేందుకు సైన్యాన్ని సిధ్ధంగా ఉంచారు.

నిరసనకారులు అనేక చోట్ల వాహనాలను అడ్డుకోవడంతో సీఎం శర్బానందా సోనోవాల్ గౌహతి విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. అయితే ఆయనను సెక్యూరిటీ అధికారులు అతి కష్టం మీద ఆయన నివాసానికి చేర్చారు. పోలీసులతో జరిగిన ఘర్షణల్లో అనేకమంది విద్యార్థులు గాయపడ్డారు. సెక్రటేరియట్ వద్ద ప్రభుత్వ పథకాలను హైలైట్ చేస్తూ ఉంచిన పలు అడ్వర్టైజింగ్ బ్యానర్లు, హోర్డింగులను ఆందోళనకారులు చించి తగులబెట్టారు. వివాదాస్పద బిల్లును ప్రభుత్వం ఉపసంహరించుకునేంతవరకు తమ ఆందోళన కొనసాగుతుందని విద్యార్ధి నాయకులు హెచ్చరించారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu