‘రౌద్రం రణం రుధిరం’ అర్థం ఏంటో చెప్పిన వివి వినాయక్..

ఈ మోషన్‌ మోస్టర్‌ గురించి మెగాస్టార్ చిరూతో పాటు.. పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు తమ తమ అభిప్రాయాలను షేర్ చేస్తున్నారు. తాజాగా దీనిపై డైరెక్టర్ వివి వినాయక్ స్పందించారు. మరోసారి టైటిల్‌లో ఉన్న రౌధ్రం, రణం, రుధిరం అర్థం ఏమిటో...

  • Tv9 Telugu
  • Publish Date - 2:21 pm, Thu, 26 March 20
'రౌద్రం రణం రుధిరం' అర్థం ఏంటో చెప్పిన వివి వినాయక్..

ఎంతో కాలంగా టాలీవుడ్ ప్రేక్షకులు ఎదురు చూసిన.. ‘ఆర్ఆర్ఆర్’ టైటిల్‌ ఫుల్‌ఫామ్‌తో పాటు ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు దర్శకధీరుడు రాజమౌళి. పోస్ట‌ర్ ఉగాది సంద‌ర్భంగా బుధ‌వారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు దీన్ని విడుదల చేశారు రాజమౌళి. మోష‌న్ పోస్ట‌ర్‌లో ఆర్ అంటే రౌద్రం, ఆర్ అంటే రుధిరం, మ‌రో ఆర్ అంటే ర‌ణం అని చూపించారు. ఇందులో రామ్‌చ‌ర‌ణ్ అగ్ని క‌ణాల మ‌ధ్య‌, ఎన్టీఆర్‌ని స్వ‌చ్ఛ‌మైన జ‌లాల మ‌ధ్య‌ చూపించారు. రౌద్రానికి రుధిరానికి మ‌ధ్య జ‌రిగే ర‌ణంగా ఈ చిత్రం ఉండ‌బోతోంద‌ని మోష‌న్ పోస్ట‌ర్ చెప్ప‌క‌నే చెబుతోంది.

ఈ మోషన్ పోస్టర్ రిలీజ్‌తో ఎన్టీఆర్, చెర్రీల అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ఇప్పటికే ఈ మోషన్ పోస్టర్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ మోషన్‌ మోస్టర్‌ గురించి మెగాస్టార్ చిరూతో పాటు.. పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు తమ తమ అభిప్రాయాలను షేర్ చేస్తున్నారు. తాజాగా దీనిపై డైరెక్టర్ వివి వినాయక్ స్పందించారు. మరోసారి టైటిల్‌లో ఉన్న రౌధ్రం, రణం, రుధిరం అర్థం ఏమిటో వివరించారు.

బ్రిటీష్ ప్రభుత్వ పాలనపై కట్టలు తెంచుకున్నదే ‘రౌద్రం’. ఈ ఇద్దరూ కలిసి చేయాలనుకున్నది ‘రణం’ అని, ఆ యుద్ధంలో వాళ్లు అర్పించినది ‘రుధిరం’ అని ఆయన కామెంట్ చేశారు. వినాయక్ కామెంట్ వైరల్ అవుతోంది. ఇక వినాయక్ ట్వీట్‌పై ఆర్జీవీ స్పందించారు. ఒత్తిడిని పెంచే వార్తలు విరామం లేకుండా ఒకదాని తరువాత ఒకటి వినాల్సి వస్తోన్న సమయంలో.. రాబోయే మంచి విషయాల కోసం ఎదురుచూడాలని గుర్తు చేసిన రాజమౌళికి ధన్యవాదాలు తెలిపారు.

ఇవి కూడా చదవండి: ఏప్రిల్ 15 తరువాత కూడా లాక్‌డౌన్ కంటిన్యూ?

కరోనా ఎఫెక్ట్: కమల్ హాసన్ ఉదార భావం.. తన ఇంటినే హాస్పిటల్‌గా మార్చేస్తారట

కరోనా వైరస్ తొందరగా వ్యాపించే ప్రదేశాలు ఇవే.. జాగ్రత్తగా ఉండండి!

తన కారును ఆపినందుకు యువతి హల్‌చల్.. పోలీసులను కొరికి.. రక్తం మీద ఊసి..

కరోనా విజృంభణ: టీఆర్ఎస్ నేతల కీలక నిర్ణయం.. రూ.500 కోట్ల విరాళం

కరోనా ఎఫెక్ట్: పెరిగిన కండోమ్స్, ఐపిల్స్ సేల్స్

సీఎం సహాయ నిధికి.. విరాళంగా ఎంపీ బాలశౌరి రూ.4 కోట్లు