”అల్లు” పేరుతో రామ్ గోపాల్ వ‌ర్మ‌ నెక్ట్స్ సినిమా..

TV9 Telugu Digital Desk

TV9 Telugu Digital Desk | Edited By:

Updated on: Aug 02, 2020 | 3:20 PM

వివాదాల డైరెక్ట‌ర్ ఆర్జీవీ త‌న నెక్ట్స్ ప్రాజెక్టును ప్ర‌క‌టించారు. ఇటీవ‌లే 'ప‌వ‌ర్ స్టార్' సినిమాతో వివాదానికి తెర‌లేపిన రామ్ గోపాల్ వ‌ర్మ ఇప్పుడు టాలీవుడ్‌లోని ప్ర‌ముఖ నిర్మాత ఇంటి పేరుతో కొత్త చిత్రాన్ని ప్ర‌క‌టించారు. ''అల్లు'' అనే ఫిక్ష‌న‌ల్ మూవీ తెర‌కెక్కిస్తాన‌ని సోష‌ల్...

''అల్లు'' పేరుతో రామ్ గోపాల్ వ‌ర్మ‌ నెక్ట్స్ సినిమా..

వివాదాల డైరెక్ట‌ర్ ఆర్జీవీ త‌న నెక్ట్స్ ప్రాజెక్టును ప్ర‌క‌టించారు. ఇటీవ‌లే ‘ప‌వ‌ర్ స్టార్’ సినిమాతో వివాదానికి తెర‌లేపిన రామ్ గోపాల్ వ‌ర్మ ఇప్పుడు టాలీవుడ్‌లోని ప్ర‌ముఖ నిర్మాత ఇంటి పేరుతో కొత్త చిత్రాన్ని ప్ర‌క‌టించారు. ”అల్లు” అనే ఫిక్ష‌న‌ల్ మూవీ తెర‌కెక్కిస్తాన‌ని సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ వేదిక‌గా ట్వీట్ చేశాడు. సినిమాలో ఓ స్టార్ హీరో కుటుంబం కోసం అత‌డి బామ్మ‌ర్ది ఏం చేసాడో చూపిస్తాన‌ని అన్నారు. అయితే ‘జ‌న‌రాజ్యం’ పార్టీ స్థాప‌న‌తో ఈ క‌థ మొద‌ల‌వుతుంద‌ని పేర్కొన్నారు. ఈ చిత్రానికి ‘అల్లు’ అని పెట్ట‌డానికి కార‌ణాన్ని కూడా వెల్ల‌డించారు ఆర్జీవీ.

‘అంద‌రితో త‌న‌ని ‘ఆహా’ అనిపించుకోవ‌టానికి, అలాగే త‌న‌కి కావాల్సిన వాళ్ల‌కే మంచి జ‌రిగేలా చెప్పి ప్లాన్‌ల మీద ప్లాన్లు వేస్తూ ఉండే ఓ పెద్ద అల్లిక‌ల మాస్ట‌ర్ క‌థే ఈ అల్లు అంటూ’ ట్వీట్ చేశారు డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ‌. ఇక ఈ సినిమాలో పాత్ర‌ల‌ను కూడా ఆర్జీవీ ప్ర‌క‌టించారు. సినిమాలో ఎ అర‌వింద్, కె చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్, కెఆర్ చ‌ర‌ణ్, ఎ అర్జున్, ఎ శిరీష్‌ పాత్ర‌ల‌ను కూడా వ‌ర్మ తెలియ‌జేశారు. కాగా మ‌రోవైపు క‌రోనా వైర‌స్ వ్యాప్తితో సినిమా షూటింగులు తీయ‌డానికి ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు జంకుతుంటే.. రామ్ గోపాల్ వ‌ర్మ మాత్రం వ‌రుస పెట్టి చిత్రాల‌ను తీస్తూ.. సంచ‌ల‌నం సృష్టిస్తున్నారు.

Read More:

క‌రోనాతో పెద్ద‌మ్మ త‌ల్లి గుడిలో కొత్త ప్ర‌యోగం… గొడుగుల‌తో!

‘క్యాస్టింగ్ కౌచ్’‌పై న‌టి ప్ర‌గ‌తి సంచ‌ల‌న కామెంట్స్..

సీఎం జ‌గ‌న్‌కు చెన్నైవాసి అరుదైన కానుక‌.. బంగారు, వెండితో మ‌సీదు!

 ‘ఆత్మ నిర్భ‌ర్ భార‌త్ లోగో’ త‌యారు చేయండి.. రూ.25 వేలు గెలుపొందండి!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu