మరోసారి పెరిగిన డీజిల్ ధరలు..

డీజిల్‌ ధరలు మరోసారి పెరిగాయి. పెట్రోల్‌ ధరల్లో ఎలాంటి మార్పు లేనప్పటికీ, డీజిల్‌పై 13 పైసలు పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం..

  • Sanjay Kasula
  • Publish Date - 11:12 am, Wed, 15 July 20
మరోసారి పెరిగిన డీజిల్ ధరలు..

Diesel Price Hiked Again : డీజిల్‌ ధరలు మరోసారి పెరిగాయి. పెట్రోల్‌ ధరల్లో ఎలాంటి మార్పు లేనప్పటికీ, డీజిల్‌పై 13 పైసలు పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశరాజధాని ఢిల్లీలో లీటర్‌ డీజిల్‌ ధర రూ.81.18కి పెరిగింది. లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.80.43గా ఉన్నది.

గత నెల 7 నుంచి 22 రోజులపాటు పెట్రో, డీజిల్‌ ధరలు వరుసగా పెరిగాయి. దీంతో లీటర్‌ డీజిల్‌పై రూ.11.4 పైసలు పెరిగింది. పెట్రోల్‌ ధరలు చివరిసారిగా జూన్‌ 29న పెరిగాయి. అప్పటి నుంచి దేశంలో పెట్రోల్‌ కంటే డీజిల్‌ ధరలే అధికంగా ఉంటున్నాయి.

ఢిల్లీ : Petrol ₹80.43. Diesel ₹81.05

ముంబై : Petrol ₹87.19. Diesel ₹79.27

చెన్నై : Petrol ₹83.63. Diesel ₹78.11

హైదరాబాద్ : Petrol ₹83.49. Diesel ₹79.14

బెంగళూరు : Petrol ₹83.04. Diesel ₹77.02