స్పైస్ జెట్‌కు షోకాజ్ నోటీసులు

పుణే నుంచి కోల్‌కతా విమానాశ్రయానికి వచ్చిన స్పైస్ జెట్ విమానాన్ని ల్యాండింగ్ చేస్తున్న సమయంలో పక్కకు జారి పోవడంతో ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు. దీంతో పౌరవిమానయానశాఖ డైరెక్టర్ జనరల్ స్పైస్ జెట్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 2వ తేదీన ఈ ఘటన జరిగింది. విమానం ల్యాండింగులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్పైస్ జెట్ విమానయాన సంస్థతో పాటు.. పైలెట్ల పై చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని ఏవియేషన్ రెగ్యులేటరీ అథారిటీ నోటీసు […]

స్పైస్ జెట్‌కు షోకాజ్ నోటీసులు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 05, 2019 | 10:52 AM

పుణే నుంచి కోల్‌కతా విమానాశ్రయానికి వచ్చిన స్పైస్ జెట్ విమానాన్ని ల్యాండింగ్ చేస్తున్న సమయంలో పక్కకు జారి పోవడంతో ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు. దీంతో పౌరవిమానయానశాఖ డైరెక్టర్ జనరల్ స్పైస్ జెట్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 2వ తేదీన ఈ ఘటన జరిగింది. విమానం ల్యాండింగులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్పైస్ జెట్ విమానయాన సంస్థతో పాటు.. పైలెట్ల పై చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని ఏవియేషన్ రెగ్యులేటరీ అథారిటీ నోటీసు జారీ చేసింది. పౌరవిమానయాన సంస్థ డైరెక్టరు జనరల్ సేఫ్టీ నిబంధనలను స్పైస్ జెట్ ఎందుకు పాటించలేదని నోటీసులో ప్రశ్నించింది. భారీ వర్షాలు కురుస్తున్నపుడు విమానాశ్రయాల్లోని రన్ వే పై విమానం పక్కకు జరగడం లాంటి ఘటనలు జరుగుతుంటాయని, కాని వాటిని నివారించాలని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు.