ఏడుపాయల ఆలయ ఛైర్మన్ అవినీతి చిట్టా..!

| Edited By: Srinu

Jun 20, 2019 | 4:49 PM

తెలంగాణ కనకదుర్గగా పిలువబడే ఏడుపాయల ఆలయం పాలకమండలి సభ్యుల అవితీతి బట్టబయలైంది. వేలాదిగా తరలివచ్చే భక్తులు సమర్పించే కానుకలు నేతలకు కాసులు కురిపించే వరాలుగా మారాయి. కోరిన కోర్కెలు తీరడంతో అమ్మవారికి బలిఇచ్చే మేకలు దావత్‌లకు బలైపోతున్నాయి. ఇలా అనేక ఆరోపణలతో ఆలయ ప్రతిష్టను దిగజార్చుకుంటున్నారు పాలకమండలి సభ్యులు. నాలుగేళ్ల క్రితం ఏడుపాయల నవదుర్గామాత ఆలయానికి చైర్మన్‌గా పట్టోళ్ల విష్ణువర్ధన్‌తో పాటు.. మరో తొమ్మిది మంది సభ్యులతో కూడిన పాలకమండలి ఏర్పాటు చేశారు. రెండోసారి కూడా వీరినే […]

ఏడుపాయల ఆలయ ఛైర్మన్ అవినీతి చిట్టా..!
Follow us on

తెలంగాణ కనకదుర్గగా పిలువబడే ఏడుపాయల ఆలయం పాలకమండలి సభ్యుల అవితీతి బట్టబయలైంది. వేలాదిగా తరలివచ్చే భక్తులు సమర్పించే కానుకలు నేతలకు కాసులు కురిపించే వరాలుగా మారాయి. కోరిన కోర్కెలు తీరడంతో అమ్మవారికి బలిఇచ్చే మేకలు దావత్‌లకు బలైపోతున్నాయి. ఇలా అనేక ఆరోపణలతో ఆలయ ప్రతిష్టను దిగజార్చుకుంటున్నారు పాలకమండలి సభ్యులు. నాలుగేళ్ల క్రితం ఏడుపాయల నవదుర్గామాత ఆలయానికి చైర్మన్‌గా పట్టోళ్ల విష్ణువర్ధన్‌తో పాటు.. మరో తొమ్మిది మంది సభ్యులతో కూడిన పాలకమండలి ఏర్పాటు చేశారు. రెండోసారి కూడా వీరినే కొనసాగించారు. దీంతో మరోసారి అవకాశం రాదనుకున్నారేమో.. ఇష్టం వచ్చినట్లు అవినీతికి పాల్పడ్డారు. ఇంతకాలం గుట్టుగా సాగిన వ్యవహారం సభ్యులకు, ఛైర్మన్‌ మధ్య పంపకాలలో వచ్చిన తేడాలు అసలు విషయాన్ని బయటపెట్టాయి. నిబంధనలకు విరుద్దంగా బంధువులను ఆలయంలో ఉద్యోగులుగా తీసుకున్నారని.. కోట్లాది రూపాయల అక్రమాలకు పాల్పడిన ఛైర్మన్ పై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.