కరోనాతో మానసిక ఒత్తిడికి గురవుతున్న గర్భిణీలు

కరోనా రాకాసి గర్భంతో ఉన్న మహిళతో పాటు పుట్టబోయే బిడ్డల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావితం చేస్తుందంటున్నారు కెనడాలోని అల్ బెర్టా యూనివర్సిటీ సైంటిస్టులు.

కరోనాతో మానసిక ఒత్తిడికి గురవుతున్న గర్భిణీలు
Balaraju Goud

|

Jun 21, 2020 | 3:13 PM

కరోనా రాకాసి ఇప్పటి వారికే కాదు భవిష్యత్ లో కూడా ప్రభావాన్ని చూపుతుందట. ముఖ్యంగా గర్భంతో ఉన్న మహిళతో పాటు పుట్టబోయే బిడ్డల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావితం చేస్తుందంటున్నారు కెనడాలోని అల్ బెర్టా యూనివర్సిటీ సైంటిస్టులు.

లాక్ డౌన్ పుణ్యమాని ఇంటికి జనం పరిమితమయ్యారు. ముఖ్యంగా గర్భిణులు, పసిపిల్లలు కదలనూ లేదు. భౌతిక దూరం పాటించడంతో పాటు కొత్తగా పిల్లలకు జన్మనిచ్చినవారి మానిసికస్థితిపై కెనడాలోని అల్ బెర్టా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఆధ్యయనం చేశారు. దీంతో వాటికి సంబంధించి ఆసక్తికర విషయాలను ది జర్నల్ ఫ్రాంటీయర్స్ ఇన్ గ్లోబల్ ఉమెన్స్ హెల్త్ అనే పత్రికలో ప్రచురించారు.

గర్బిణి మహిళలు, ఐసోలేషన్ లో ఉన్న మహిళల స్థితిగతులపై శాస్త్రవేత్తలు ఆధ్యయనం చేశారు. దాదాపు 900 మంది ఆడవాళ్ల అభిప్రాయాలు తీసుకున్నారు. వీరిలో 520 మంది ప్రెగ్నెంట్స్​ కాగా 380 మంది ఏడాది కిందట పిల్లలకు జన్మనిచ్చిన వారు ఉన్నారు. గర్బంతో ఉన్నప్పడు, డెలీవరి తర్వాత వారు పడ్డ మానసిన ఒత్తిడిని తెలుసుకునేందుకు సర్వే చేశారు.

అయితే కరోనా వైరస్ వ్యాప్తికి ముందు 29 శాతం గర్భిణుల్లో మామూలు ఆందోళన ఉండేదని…15 శాతం మహిళలు డిప్రెషన్ కు గురైనట్లు గ్రహించారు. కరోనా విజృంభణ అనంతరం గర్బిణీల్లో మానసిక ఆందోళన విపరీతంగా పెరిగిందట. ఈ సమయంలో గర్భిణిలు, బిడ్డకు జన్మనిచ్చిన తల్లుల్లో 72 శాతం తీవ్ర ఆందోళనకు గురయ్యారు. 41 మంది మహిళలు డిప్రెషన్ తో బాధపడ్డారని గుర్తించారు. లాక్ డౌన్ తో ఇంటికే పరిమితమవ్వడం వల్ల కనీసం శారీక వ్యాయామానికి కూడా దూరమయ్యారని తమ ఆద్యాయనంలో తేలిందన్నారు సైంటిస్టులు. సాధారణంగా గర్భంతో ఉన్నవారు వారంలో కనీసం 150 నిమిషాల పాటు సాధారణ ఎక్ససైజ్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా ఫిజికల్ యాక్టివిటీ మానేయటంతో చాలా మందిలో డిప్రెషన్ సింప్టమ్స్ పెరిగాయని గుర్తించారు.

గర్బిణి మహిళలు మానసికంగా ఆందోళనతో ఉండటం వల్ల తల్లి, పిల్లల ఇద్దరి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందంటున్నారు సైంటిస్టులు. కొన్ని ఏళ్ల పాటు మానసికం ఒత్తిడికి గురవుతారని ఈ స్డడీకి కో అథర్ గా వ్యవహారించిన డావెన్ పోర్ట్ చెప్పారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu