యూపీ – హర్యానా సరిహద్దులో ఘోర రోడ్డు ప్రమాదం, ఏకంగా 20 వాహనాలు ఢీ, కుప్పలు కుప్పలుగా ఇరుక్కుపోయిన వైనం

ఉత్తరాదిని తీవ్రమైన పొగమంచు చుట్టుముడుతోంది. అపాయకారిగా మారి ప్రజలు ప్రమాదాల బారిన పడేలా చేస్తోంది. వందేళ్ల కాలంలో..

యూపీ - హర్యానా సరిహద్దులో ఘోర రోడ్డు ప్రమాదం, ఏకంగా 20 వాహనాలు ఢీ, కుప్పలు కుప్పలుగా ఇరుక్కుపోయిన వైనం
Follow us
Venkata Narayana

|

Updated on: Jan 01, 2021 | 5:29 PM

ఉత్తరాదిని తీవ్రమైన పొగమంచు చుట్టుముడుతోంది. అపాయకారిగా మారి ప్రజలు ప్రమాదాల బారిన పడేలా చేస్తోంది. పదిహేనేళ్ల కాలంలో ఇవాళ రాజధాని ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డవగా, యూపీ – హర్యానా సరిహద్దులో దట్టమైన పొగమంచు కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఏకంగా 20 వాహనాలు ఒకదానినొకటి ఢీకొని కుప్పలు కుప్పలుగా ఇరుక్కుపోయాయి. అనేక మంది వాహనాల్లో నలిగిపోయి తీవ్రంగా గాయపడ్డారు. కార్లు తుక్కుతుక్కయ్యాయి. బాగ్‌పాట్ సమీపంలోని యుపి – హర్యానా సరిహద్దు ప్రాంతమయిన తూర్పు పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను బాగ్‌పట్‌లోని జిల్లా ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. వారం రోజుల క్రితం దట్టమైన పొగమంచు కారణంగా ఇదే రీతిన, ఇదే ప్రాంతంలో ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 22 న, తూర్పు పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వే దగ్గర సింగోలి టాగా – షర్ఫాబాద్ గ్రామాల మధ్య కార్లు, బస్సులు, ట్రక్కులతో సహా డజన్ల కొద్దీ వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది గాయపడ్డారు.