మాస్క్ లేకుంటే రూ. 2 వేలు భారీ జరిమానా.. నోటిఫికేషన్ జారీ చేసిన సర్కార్…

Ravi Kiran

Ravi Kiran |

Updated on: Nov 21, 2020 | 7:37 AM

దేశ రాజధాని ఢిల్లీ కరోనా సెకండ్ వేవ్‌తో అల్లాడిపోతోంది. ప్రతీ రోజూ పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్..

మాస్క్ లేకుంటే రూ. 2 వేలు భారీ జరిమానా.. నోటిఫికేషన్ జారీ చేసిన సర్కార్…

Delhi Government: దేశ రాజధాని ఢిల్లీ కరోనా సెకండ్ వేవ్‌తో అల్లాడిపోతోంది. ప్రతీ రోజూ పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ సర్కార్ వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కఠిన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మాస్క్ ధరించకుండా బయటకొచ్చిన వారికి రూ. 2 వేలు జరిమానా విధిస్తూ కీలక ననిర్ణయం తీసుకుంది.

అంతేకాదు కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించి బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మినా, పొగాకు వాడినా, భౌతిక దూరాన్ని పాటించకపోయినా రూ. 2 వేలు భారీ జరిమానాను విధిస్తామని పేర్కొంటూ ఢిల్లీ ప్రభుత్వం శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. కాగా, గతంలో ఈ జరిమానా రూ. 500 ఉన్న సంగతి తెలిసిందే. శుక్రవారం తాజాగా ఢిల్లీలో మరో 6608 పాజిటివ్ కేసులు, 118 మరణాలు సంభవించాయి. దీనితో అక్కడ కరోనా కేసుల సంఖ్య  5.17 లక్షలకు చేరింది.

Also Read: మత్స్యకారులకు గుడ్ న్యూస్.. నాలుగు ఫిషింగ్‌ హార్బర్లకు శంకుస్థాపన చేయనున్న సీఎం జగన్..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu