AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికాలో చచ్చి బతికిన మహిళ

అమెరికాలోని డెట్రాయిట్‌లోని ఓ మహిళ చచ్చి బతికింది. అంత్యక్రియల ప్రక్రియ మొదలు పెడుతున్న సమయంలోనే ఆమె శ్వాస తీసుకోవడాన్ని గమనించారు..

అమెరికాలో చచ్చి బతికిన మహిళ
Balu
|

Updated on: Aug 25, 2020 | 4:44 PM

Share

చచ్చిబతికినంత పనైందన్న జాతీయాన్ని మనం అప్పుడప్పుడూ వాడుతుంటాం.. కానీ ఆ జాతీయాన్ని వాడే రైటు అమెరికాలోని డెట్రాయిట్‌లోని ఓ మహిళకే ఎక్కువుంది. కారణం ఆమె చచ్చి బతికింది కాబట్టి! అసలేం జరిగిందంటే.. మొన్నటి ఆదివారం ఓ గుర్తు తెలియని మహిళ పారామెడిక్స్‌కు ఫోన్‌ చేసింది.. ఓ ఇంట్లో మహిళ స్పృహతప్పి పడి ఉందని చెప్పింది.. ఆమె ఇచ్చిన సమాచారం మేరకు పారామెడిక్స్‌ అక్కడకు వెళ్లారు.. వెళ్లి చూస్తే ఓ 20 ఏళ్ల మహిళ ఆపస్మారక స్థితిలో ఉంది.. ఆమెకు ఓ అరగంటపాటు వైద్య పరీక్షలు చేసి చనిపోయిందని డిక్లేర్‌ చేశారు.. అంత్యక్రియల కోసం ఆమె మృతదేహాన్ని డెట్రాయిట్‌లోని జేమ్స్‌ కోల్‌ శ్మశానానికి తీసుకెళ్లారు.. అంత్యక్రియల ప్రక్రియ మొదలు పెడుతున్న సమయంలోనే ఆమె శ్వాస తీసుకోవడాన్ని గమనించారు.. వెంటనే మళ్లీ ఆ మహిళను హాస్పిటల్‌కు తీసుకొచ్చారు. ఇప్పుడామె పల్స్‌ రేటు బాగుందట! త్వరలోనే పూర్తిగా కోలుకుంటుందని డాక్టర్లు చెబుతున్నారు. ఈ భూమ్మీద ఆమెకు ఇంకా నూకలున్నాయన్నమాట! దీర్ఘాయుష్మాన్ భవ..!