పగటిపూట నిద్రిస్తున్నారా..? అయితే మీకు ఈ వ్యాధులు రావడం ఖాయం!

ఇలా నిద్రపోయే వారికి భవిష్యత్తులో పలు వ్యాధులు వచ్చే అవకాశముందని స్టాన్ ఫోర్ట్ వర్సిటీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. వారికి డయాబెటిస్, బరువు పెరగడం, తలనొప్పి, గుండె జబ్బులు, క్యాన్సర్, అర్థరైటిస్ వంటి వ్యాధులు..

పగటిపూట నిద్రిస్తున్నారా..? అయితే మీకు ఈ వ్యాధులు రావడం ఖాయం!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 02, 2020 | 9:38 PM

నిద్ర.. ఎన్నో స్ట్రెస్ ఫీలింగ్స్‌కి చక్కటి పరిష్కారం. కాసేపు అలా నిద్రిస్తే చాలు. ఎన్నో టెన్షన్‌లకు గుడ్‌బై చెప్పవచ్చు. చాలామంది రాత్రిపూట నిద్రపోయినా కూడా పగటి పూట కూడా ఎక్కువగా పొడుకుంటూ ఉంటారు. కానీ.. కొంతమందికి రాత్రుళ్లు నిద్రపట్టదు. దీంతో పగలు ఎక్కువ సేపు నిద్రిస్తూంటారు. కొంతమందికి వర్క్ టెన్షన్స్ వల్ల నిద్రపట్టదు.. దీంతో ఉదయం కాసేపు ఎక్కువగా నిద్రిస్తారు. మరికొందరు రాత్రుళ్లు జాబ్ చేయడం వల్ల పగలు పడుకుంటారు. కానీ.. ఇప్పుడు ట్రెండ్ మారింది. నైట్ మేల్కొని ఉండటం ఫ్యాషన్ అయ్యింది. ఇప్పుడు ఎక్కువ సేపు మేల్కొని ఫోన్స్ కాల్సింగ్స్, చాటింగ్స్ అలవాటైపోయింది. దీంతో లేట్‌గా నిత్రిస్తున్నారు.

ఇలా నిద్రపోయే వారికి భవిష్యత్తులో పలు వ్యాధులు వచ్చే అవకాశముందని స్టాన్ ఫోర్ట్ వర్సిటీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. వారికి డయాబెటిస్, బరువు పెరగడం, తలనొప్పి, గుండె జబ్బులు, క్యాన్సర్, అర్థరైటిస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశముందన్నారు. దాదాపు మూడేళ్లపాటు 10,930 మందిపై ఈ అధ్యయనం చేశామని.. ఇందులో విస్తుపోయే నిజాలు వెల్లడైనట్లు వారు తెలిపారు. పగటి పూట ఎక్కువగా నిద్రించే స్థితిని ‘హైపర్ సోమ్నోలెన్స్’ అంటారని పేర్కొన్నారు. కనుక రాత్రిపూట తగినంత నిద్రపోయే వారు పగటి పూట నిద్రపోవడం మానుకుంటే మేలని వారు సూచిస్తున్నారు.