రోజురోజుకూ పెరుగుపోతున్న టెంపరేచర్

రెండు తెలుగు రాష్ట్రాల్లో వేసవి తాపం మొదలైంది. టెంపరేచర్ రోజు రోజుకు పెరుగుతుండటంతో ఉదయం 9 గంటల నుంచి సాయంత్ర 5 గంటల వరకూ రోడ్ల మీదకు జనం రావాలంటేనే భయపడిపోతున్నారు. ఇక స్కూళ్లు, ఆఫీసులకు వెళ్లే వాళ్లైతే ఎండ దెబ్బ తగలకుండా జాగ్రత్త పడుతున్నారు. మార్చి నెల మొదటి వారానికే ఎండ ఈ స్థాయిలో ఉందని జనాలు బెంబేలెత్తిపోతున్నారు. దీంతో.. పనులపై బయటకు వెళ్లే కాకుండా ప్రయాణాలు చేసే వారు కూడా ఎండ తగలకుండా తల, […]

రోజురోజుకూ పెరుగుపోతున్న టెంపరేచర్
Follow us

| Edited By:

Updated on: Mar 09, 2019 | 9:00 AM

రెండు తెలుగు రాష్ట్రాల్లో వేసవి తాపం మొదలైంది. టెంపరేచర్ రోజు రోజుకు పెరుగుతుండటంతో ఉదయం 9 గంటల నుంచి సాయంత్ర 5 గంటల వరకూ రోడ్ల మీదకు జనం రావాలంటేనే భయపడిపోతున్నారు. ఇక స్కూళ్లు, ఆఫీసులకు వెళ్లే వాళ్లైతే ఎండ దెబ్బ తగలకుండా జాగ్రత్త పడుతున్నారు. మార్చి నెల మొదటి వారానికే ఎండ ఈ స్థాయిలో ఉందని జనాలు బెంబేలెత్తిపోతున్నారు. దీంతో.. పనులపై బయటకు వెళ్లే కాకుండా ప్రయాణాలు చేసే వారు కూడా ఎండ తగలకుండా తల, ముఖాలకు మాస్క్‌లు, లేదా గొడుగులు వేసుకొని తిరుగుతున్నారు. ఇక ఇళ్ల్లలో ఉండే వారైతే ఫ్యాన్లు, కూలర్‌లు వేసుకోలేనిదే ఉండలేమంటున్నారు.