కంగారులకు భారీ ఎదురుదెబ్బ… డేవిడ్ వార్నర్‌కు గాయం..తొడ కండరానికి దెబ్బ తగిలినట్లు నిర్ధారించిన వైద్యులు
టీమిండియాతో రెండో వన్డేలో ఆడుతున్న డేవిడ్ వార్నర్‌కు గాయమైంది. భారత బ్యాట్స్‌మన్ ధావన్ కొట్టిన బంతిని అందుకునే ప్రయత్నంలో ఈ దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది...
భారత-ఆస్ట్రేలియా సిరీస్‌లో మంచి దూకుడు మీదున్న కంగారులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియాతో రెండో వన్డేలో ఆడుతున్న డేవిడ్ వార్నర్‌కు గాయమైంది. భారత బ్యాట్స్‌మన్ ధావన్ కొట్టిన బంతిని అందుకునే ప్రయత్నంలో ఈ దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. దీంతో మ్యాచ్ మధ్యలోనే మైదానం నుంచి వెళ్లి పోయారు. తొడ కండరానికి గాయమైనట్లు ఆసీస్ జట్టు ఫిజిషియన్లు తెలిపారు.
స్కానింగ్ చేశాక అతడి పరిస్థితిని చెబుతామని తెలిపారు. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆసీస్.. నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 389 పరుగుల భారీ స్కోరు చేసింది. స్మిత్ (104) మరోసారి సెంచరీతో చెలరేగగా.. డేవిడ్ వార్నర్ (83), ఆరోన్ ఫించ్ (60), లబుషేన్ (70), మ్యాక్స్‌వెల్(63) అద్భుతమైన ప్రదర్శనను ప్రదర్శించారు.