AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుజరాత్, మహారాష్ట్రలో భారీ వర్షాలు.. తుఫాను హెచ్చరిక: ఐఎండీ

కోవిద్-19 రోజురోజుకు విజృంభిస్తోంది. లాక్‌డౌన్ కారణంగా వాయు కాలుష్యం తగ్గి.. వాతావరణంలో వేడి కూడా తగ్గింది. ఫలితంగా నైరుతి రుతుపవనాలు కేరళను తాకినట్లు తెలుస్తోంది. కేరళతో సహా ఉత్తర భారతదేశంలోని ప‌లు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీ, ఎన్‌సీఆర్‌ల‌లో శనివారం భారీ వర్షాలు కురిశాయి. ఈ రోజు(ఆదివారం) హైదరాబాద్ లో భారీవర్షం కురిసింది. లక్షద్వీప్ సమీపంగా ఆగ్నేయ అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడినట్లు ఐఎండీ తెలిపింది. కాగా.. ఈ అల్పపీడనం వల్ల దేశంలో భారీ […]

గుజరాత్, మహారాష్ట్రలో భారీ వర్షాలు.. తుఫాను హెచ్చరిక: ఐఎండీ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 31, 2020 | 5:14 PM

Share

కోవిద్-19 రోజురోజుకు విజృంభిస్తోంది. లాక్‌డౌన్ కారణంగా వాయు కాలుష్యం తగ్గి.. వాతావరణంలో వేడి కూడా తగ్గింది. ఫలితంగా నైరుతి రుతుపవనాలు కేరళను తాకినట్లు తెలుస్తోంది. కేరళతో సహా ఉత్తర భారతదేశంలోని ప‌లు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీ, ఎన్‌సీఆర్‌ల‌లో శనివారం భారీ వర్షాలు కురిశాయి. ఈ రోజు(ఆదివారం) హైదరాబాద్ లో భారీవర్షం కురిసింది. లక్షద్వీప్ సమీపంగా ఆగ్నేయ అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడినట్లు ఐఎండీ తెలిపింది.

కాగా.. ఈ అల్పపీడనం వల్ల దేశంలో భారీ తుఫాను సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ అల్పపీడనం నేడు బలపడుతుందని, రేపటికి తుఫానుగా పరిణమిస్తుందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మొహాపాత్ర వెల్లడించారు. ఈ తుఫాను క్రమంగా ఉత్తరం వైపు పయనిస్తుందని, దీనివల్ల గుజరాత్, మహారాష్ట్ర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. జూన్ 3వ తేదీ నాటికి ఇది తీరానికి చేరే అవకాశం ఉందని మొహాపాత్ర తెలిపారు.

[svt-event date=”31/05/2020,5:03PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event date=”31/05/2020,5:08PM” class=”svt-cd-green” ]

[/svt-event]