Viral: ఎయిర్‌పోర్ట్‌లో కంగారుగా ఇద్దరు పాసింజర్స్.. వారి లగేజ్ చెక్ చేయగా

ఎయిర్‌పోర్ట్‌లో సెక్యూరిటీ ఫోర్స్ చాలా అలెర్ట్‌గా ఉంటుంది. ఎవరైనా అనుమానం కలిగినా వెంటనే అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతారు. అలానే కష్టమ్స్ కూడా డ్రగ్స్, బంగారం వంటివి అక్రమ రవాణా కాకుండా కాపు కాస్తుంది. తాజాగా బెంగళూరులోని విమానాశ్రయంలో ఓ ఇద్దరు ప్రయాణీకులు అనుమానాస్పదంగా కనిపించారు.

Viral: ఎయిర్‌పోర్ట్‌లో కంగారుగా ఇద్దరు పాసింజర్స్.. వారి లగేజ్ చెక్ చేయగా
Ganja
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 27, 2024 | 1:43 PM

కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఇటీవల దాదాపు రూ. 80 లక్షల విలువైన 8 కిలోల హైక్వాలిటీ హైడ్రోపోనిక్ గంజాయిని అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. బ్యాంకాక్ నుంచి వేర్వేరు విమానాల్లో వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి ఈ మత్తుపదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. హైడ్రోపోనిక్ గంజాయిని ల్యాబ్‌లలో అదనపు పోషకాలతో నీటిలో సాగు చేస్తారు. విమానాశ్రయంలో మూడు వారాల వ్యవధిలో ఈ రకమైన గంజాయిని స్వాధీనం చేసుకోవడం ఇది రెండవ అతిపెద్దదిగా చెబుతున్నారు. ఇద్దరు మధ్య వయస్కులైన భారతీయ పౌరులు డిసెంబర్ 19, 20 తేదీల్లో కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 2 వద్దకు వచ్చారు. ప్రయాణీకుల ప్రొఫైల్ ఆధారంగా, అధికారులు వారిని ప్రశ్నించడానికి ఆపారు. వారు 20 రోజుల పాటు బ్యాంకాక్‌లో ఉన్నారని వారి ట్రావెల్ హిస్టరీని బట్టి అర్థమైంది. స్మగ్లర్లు పర్యాటకులుగా నటిస్తూ ఇలా గంజాయి స్మగ్లింగ్ చేస్తారని అధికారులు చెబుతున్నారు.

ఒక ప్రయాణికుడు ట్రాలీ సూట్‌కేస్‌లో గంజాయిని దాచిపెట్టగా, మరొకరు తన బ్యాగ్‌లలో స్నాక్ ప్యాకెట్లలో దాచారు. వారు తమ వెనుక ఎవరూ లేరని చెబుతున్నప్పటికీ, వారు పెద్ద స్మగ్లింగ్ సిండికేట్‌లో భాగమని అధికారులు అనుమానిస్తున్నారు. నిందితులపై నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. హైడ్రోపోనిక్ గంజాయికి డిమాండ్ పెరుగుతోంది, ముఖ్యంగా యువతలో, తరచుగా పార్టీలలో దీనిని వినియోగిస్తారు. అంతకుముందు, నవంబర్ 30న.. చిప్స్ ప్యాకెట్లలో దాచిన 1.25 కోట్ల రూపాయల విలువైన  అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయం 

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!