జొమాటో ‘బాయ్’.. ఎవరైతే ఏంటి..?

ఈ మధ్యకాలంలో ఎటు చూసినా వింత సంఘటనలు జరుగుతున్నాయి. వివేకం ఉండే ప్రవర్తిస్తున్నారో.. లేదో.. కానీ.. వారు చేసే పనులు కొన్ని ఆశ్యర్యం కలిగిస్తున్నాయి. తాజాగా.. ఇలాంటి సంఘటనే ఢిల్లీలో జరిగింది. అమిత్‌ శుక్లా అనే వ్యక్తి.. ఆహారం కోసం జొమాటో యాప్‌లో ఆర్డర్ చేశాడు. అయితే.. ఆ యాజమాన్యం.. దీన్ని అందించడానికి ఓ ముస్లిం వ్యక్తిని డెలీవరీ బాయ్‌గా కేటాయించింది. ఇది తెలిసిన అమిత్ ‌శుక్లా తన ఫుడ్‌ని క్యాన్సెల్ చేశాడు. తన మతానికి చెందని […]

జొమాటో 'బాయ్'.. ఎవరైతే ఏంటి..?
Follow us

| Edited By:

Updated on: Jul 31, 2019 | 5:15 PM

ఈ మధ్యకాలంలో ఎటు చూసినా వింత సంఘటనలు జరుగుతున్నాయి. వివేకం ఉండే ప్రవర్తిస్తున్నారో.. లేదో.. కానీ.. వారు చేసే పనులు కొన్ని ఆశ్యర్యం కలిగిస్తున్నాయి. తాజాగా.. ఇలాంటి సంఘటనే ఢిల్లీలో జరిగింది. అమిత్‌ శుక్లా అనే వ్యక్తి.. ఆహారం కోసం జొమాటో యాప్‌లో ఆర్డర్ చేశాడు. అయితే.. ఆ యాజమాన్యం.. దీన్ని అందించడానికి ఓ ముస్లిం వ్యక్తిని డెలీవరీ బాయ్‌గా కేటాయించింది. ఇది తెలిసిన అమిత్ ‌శుక్లా తన ఫుడ్‌ని క్యాన్సెల్ చేశాడు. తన మతానికి చెందని వ్యక్తి నుంచి.. తాను ఆర్డర్‌ను తీసుకోబోనంటూ హఠం పట్టాడు. ఆ సంస్థ నుంచి రావాల్సిన డబ్బులు కూడా తీసుకోలేదని.. గర్వంగా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీనికి జొమాటో యాప్ నిర్వాహకులు.. ‘ఆహారానికి మతం, కులం అడ్డురావని’.. కౌంటర్ ఇచ్చారు. దీనికి.. నెటిజన్లు.. అద్భుతంగా రిప్లై ఇచ్చారని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్‌గా మారుతోంది.