పిల్లలు లేని దంపతులకు వరం ఈ ఆహారం..!

10 February 2026

Jyothi Gadda

గ్లూటెన్ లేని ఆహారం అవసరమైన వారికి ఇది ఒక మంచి ఎంపిక. సామలను అన్నం వల్ల వండుకుని తినవచ్చు. లేదా వివిధ రకాల వంటకాల్లో ఉపయోగించవచ్చు.

సామలు సహజంగా గ్లూటెన్ రహితమైన ఆహారం. గ్లూటెన్ పడని వారికి ఇది ఉత్తమమైన ఎంపిక. గోధుమలు, బార్లీ వంటి వాటికి బదులుగా సామలు బెటర్.

సామలు తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా పెరగవు. మధుమేహం ఉన్నవారు వీటిని తీసుకోవడం రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.

సామలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పేగు కదలికలను సాఫీగా చేస్తుంది.

సామలలో మెగ్నీషియం ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. విటమిన్ B3  కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.

సామలు పునరుత్పత్తి సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. మహిళల్లో పిసిఒడిని నియంత్రిస్తుంది. పురుషుల్లో స్పెర్మ్ కౌంట్‌ను పెంచుతుంది.

సామలు మానవ శోషరస వ్యవస్థను శుద్ధి చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.  మెదడు, గొంతు, రక్తం, థైరాయిడ్, క్లోమ గ్రంథి క్యాన్సర్లతో పోరాడటానికి మేలు చేస్తుంది.

సామలలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల కడుపు నిండినట్లు అనిపిస్తుంది, ఎక్కువసేపు ఆకలి వేయదు. ఇది బరువు నియంత్రణకు సహాయపడుతుంది.