Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టులో ఏం జరుగుతోంది..!

చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్‌మెంట్‌తో ఎలాంటి విభేదాలు లేవని, వ్యక్తిగత కారణాలతోనే భారత్‌కు వచ్చానని సీఎస్‌కే జట్టు వైస్ కెప్టెన్ సురేశ్ రైనా స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా టోర్నీలో మళ్లీ ఆడే అవకాశం కూడా ఉందని హింట్ ఇచ్చాడు. ఇదంతా జరుగుతుండగానే రైనానను గ్రూప్ నుంచి..

చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టులో ఏం జరుగుతోంది..!
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 04, 2020 | 11:08 AM

చెన్నై సూపర్‌కింగ్స్‌- సురేశ్‌ రైనా వివాదంలో మరో కొత్త వివాదం వెలుగుచూసింది. దుబాయ్‌ నుంచి భారత్‌కు రావడంతో.. సీఎస్‌కే జట్టు వాట్సాప్‌ గ్రూప్‌ నుంచి రైనాను తొలగించారనే సమాచారం సంచలనంగా మారింది. ఆ తర్వాత అతడు జట్టు యాజమాన్యాన్ని కలిసి సారీ కూడా చెప్పినట్లుగా తెలుస్తోంది. తిరిగొచ్చేందుకు అవకాశం ఇవ్వాలనీ కోరాడని వార్తలు గుప్పుమంటున్నాయి.

అయితే చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్‌మెంట్‌తో ఎలాంటి విభేదాలు లేవని, వ్యక్తిగత కారణాలతోనే భారత్‌కు వచ్చానని సీఎస్‌కే జట్టు వైస్ కెప్టెన్ సురేశ్ రైనా స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా టోర్నీలో మళ్లీ ఆడే అవకాశం కూడా ఉందని హింట్ ఇచ్చాడు. మరోవైపు జట్టు యజమాని ఎన్ శ్రీనివాసన్ కూడా రైనా రీఎంట్రీ‌ని ధోనీ డిసైడ్ చేస్తాడని తెలిపాడు.

అయినా తాజాగా జట్టు వాట్సాప్ గ్రూప్ నుంచి రైనాను తొలగించారనే వార్త బ్రేకింగ్‌గా మారింది. జట్టును వీడిన వెంటనే రైనాను వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించినట్లు ఓ ఫ్రాంచైజీ అధికారి తెలిపాడని ఇన్‌సైడ్ స్పోర్ట్స్ వెబ్‌సైట్ పేర్కొంది. అంతేకాకుండా రైనా టీమ్‌మెనేజ్‌మెంట్‌కు క్షమాపణలు కూడా చెప్పాడని, రీఎంట్రీ కోసం ప్రయత్నిస్తున్నాడని తెలిపింది.

దుబాయ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ క్యాంప్‌ను కరోనా చుట్టుముట్టడంతో రైనాకు కుటుంబంపై బెంగ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ దీపక్ చాహర్, యువ క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్‌తో సహా 11 మంది సహాయక సిబ్బందికి కరోనా సోకడంతో రైనా తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. దీనికి తోడు పంజాబ్‌లో తన మేనమామ దారుణ హత్యకు గురవ్వడంతో తట్టుకోలేకపోయాడు. ఈ విపత్కర పరిస్థితుల్లో కుటుంబం కంటే ఏది ఎక్కువ కాదనిపించి భారత్‌కు వచ్చానని రైనా మీడియాకు తెలిపాడు.

అదే సమయంలో ‘విజయగర్వం తలకెక్కితే ఇలాగే ఉంటుంది. అతడు కోల్పోయే మొత్తం విలువేంటో తెలుసుకోవాలి’ అని రైనాపై చెన్నై సూపర్‌కింగ్స్‌ యజమాని శ్రీనివాసన్‌ విరుచుకుపడ్డారు. ఆ తర్వాత మీడియా తన వ్యాఖ్యల కోణాన్ని మార్చేసిందని యూటర్న్‌ తీసుకున్నారు. ఆ మరుసటి రోజే రైనా మీడియాతో మాట్లాడాడు. ‘శ్రీని నన్ను చిన్న కొడుకులా చూసుకున్నారు. వ్యక్తిగత, కుటుంబ కారణాలతోనే దుబాయ్‌ నుంచి వచ్చేశాను. తిరిగి ఐపీఎల్‌ ఆడేందుకు వెళ్లినా ఆశ్చర్యం లేదు’ అని అన్నాడు. ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ వాట్సప్ నుంచి రిమూవ్ అనే వార్త రైనా ఫ్యాన్స్‌ను కలవర పెడుతోంది.

గాల్లో ఉండగానే పైలట్‌కు గుండెపోటు..విమానంలో ప్రయాణికులు వీడియో
గాల్లో ఉండగానే పైలట్‌కు గుండెపోటు..విమానంలో ప్రయాణికులు వీడియో
బ్రిటిషర్లను భయపెట్టిన రోటీ.. చరిత్రను మలుపుతిప్పిన చపాతీ ఉద్యమం.
బ్రిటిషర్లను భయపెట్టిన రోటీ.. చరిత్రను మలుపుతిప్పిన చపాతీ ఉద్యమం.
అమెరికన్లపై చైనీయుల మీమ్స్‌ వీడియో
అమెరికన్లపై చైనీయుల మీమ్స్‌ వీడియో
రూ. 300 కోట్ల బంగ్లా.. లగ్జరీ కార్లు..వావ్‌ వాటే లైఫ్‌ వీడియో
రూ. 300 కోట్ల బంగ్లా.. లగ్జరీ కార్లు..వావ్‌ వాటే లైఫ్‌ వీడియో
అయ్యో చేప ఎంతపని చేసింది.. వీడియోలో మీరే చూడండి!
అయ్యో చేప ఎంతపని చేసింది.. వీడియోలో మీరే చూడండి!
దూసుకెళ్తున్ బస్సు..భయం భయంగా ప్రయాణికులు..ఏం జరిగిందంటే.. వీడియో
దూసుకెళ్తున్ బస్సు..భయం భయంగా ప్రయాణికులు..ఏం జరిగిందంటే.. వీడియో
రెస్టారెంట్‌ వింత ఆఫర్‌.. ఎంత బక్కగా ఉంటే అంత డిస్కౌంట్ వీడియో
రెస్టారెంట్‌ వింత ఆఫర్‌.. ఎంత బక్కగా ఉంటే అంత డిస్కౌంట్ వీడియో
మైక్రోసాఫ్ట్‌ బాస్‌లను ప్రశ్నించి..రచ్చ చేసిన మహిళ .. ఎందుకంటే..
మైక్రోసాఫ్ట్‌ బాస్‌లను ప్రశ్నించి..రచ్చ చేసిన మహిళ .. ఎందుకంటే..
ఫై ఓవర్‌ నుంచి ఊడిపడ్డ కాంక్రీట్‌ బీమ్‌ ..కారులోకి చొచ్చుకెళ్లి బ
ఫై ఓవర్‌ నుంచి ఊడిపడ్డ కాంక్రీట్‌ బీమ్‌ ..కారులోకి చొచ్చుకెళ్లి బ
నకిలీ డాక్టర్ మాజీ స్పీకర్‌ని చంపేసాడా? వీడియో
నకిలీ డాక్టర్ మాజీ స్పీకర్‌ని చంపేసాడా? వీడియో