యూపీలో మరో ఎన్‌కౌంటర్‌..గాయాలతో పట్టుబడ్డ క్రిమినల్..

| Edited By:

Jul 04, 2020 | 5:14 PM

ఉత్తర్‌ప్రదేశ్‌లో క్రిమినల్స్‌ వేట కొనసాగుతోంది. శుక్రవారం నాడు మోస్ట్ వాంటెడ్‌ క్రిమినల్‌ వికాస్ దుబేను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులపై క్రిమినల్స్ కాల్పులకు దిగింది తెలిసిందే. ఈ ఘటనలో..

యూపీలో మరో ఎన్‌కౌంటర్‌..గాయాలతో పట్టుబడ్డ క్రిమినల్..
Follow us on

ఉత్తర్‌ప్రదేశ్‌లో క్రిమినల్స్‌ వేట కొనసాగుతోంది. శుక్రవారం నాడు మోస్ట్ వాంటెడ్‌ క్రిమినల్‌ వికాస్ దుబేను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులపై క్రిమినల్స్ కాల్పులకు దిగింది తెలిసిందే. ఈ ఘటనలో డీఎస్పీతో సహా.. ముగ్గురు ఎస్సైలు.. మరో నలుగురు కానిస్టేబుల్లు మరణించారు. అయితే ఈ ఘటన తర్వాత పోలీసులు క్రిమినల్స్‌ను పట్టుకోవడంపై ప్రత్యేకంగా తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలో గౌతమ్‌ బుద్ద నగర్‌లోని దాద్రీ పట్టణంలో శుక్రవారం రాత్రి పోలీసులు తనిఖీలు చేపడుతుండగా.. ఓ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ను గుర్తించారు. పోలీసులను గమనిచించిన ఆ క్రిమినల్ తన దగ్గర ఉన్న తుపాకీతో పోలీసులపై కాల్పులకు దిగాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. ఎదురు కాల్పులు చేపట్టారు. ఈ ఘటనలో సదరు క్రిమినల్‌ కాలుకు బుల్లెట్‌ దిగింది. దీంతో అతడిని పోలీసులు ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై ఉత్తర్ ప్రదేశ్‌ డీసీపీ రాజేష్ సింగ్ స్పందించారు. గాయపడ్డ క్రిమినల్‌పై అనేక కేసులు ఉన్నాయని.. ఇతని ముఠాపై ఆరా తీస్తున్నామన్నారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన స్థలం నుంచి ఓ బైక్‌తో పాటు.. తుపాకీ, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపడుతున్నామన్నారు.